TG: జగన్ వ్యాఖ్యలపై ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. జగన్ మాట్లాడుతున్న తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. తిరుమల దర్శనానికి వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాల్సిందేని స్పష్టం చేశారు. డిక్లరేషన్ టీటీడీ సంప్రదాయం, నిబంధన అన్నారు. డిక్లరేషన్‌పై సంతకం చేసి జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవచ్చని సూచించారు.