HYD: సికింద్రాబాద్ లాడ్జ్‌లో యవకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భూపాలపల్లికి చెందిన అక్షయ్ (24)గతేడాది నగరానికి వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం సొంతూరుకు వెళ్లి తిరిగి మంగళవారం రాత్రి మార్కెట్ PSపరిధి బండిమెట్లోని లాడ్జిలో రూం తీసుకున్నాడు. బుధవారం ఉదయం మిత్రులు, కుటుంబసభ్యుల్లో తనకు ఇష్టమైన వాళ్ల ఫొటోలను వాట్సాప్ స్టేటస్ పెట్టి ఉరేసుకున్నాడని పోలీసులు తెలిపారు.