సింగర్ యశస్వి కొండేపూడి (Yasaswi Kondepudi) వివాదంలో ఇరుక్కున్నారు. కాకినాడకు చెందిన నవసేన ఫౌండేషన్ (Navasena Foundation) అతనిపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఫౌండేషన్ తనది అని అతను చెప్పుకుంటున్నాడని, ఆయన మోసం చేశారని నిర్వాహకురాలు ఫరా (farah) ఆరోపించారు.
సరిగమప సింగర్ యశస్వి కొండేపూడి (Yasaswi Kondepudi) వివాదంలో ఇరుక్కున్నారు. కాకినాడకు చెందిన నవసేన ఫౌండేషన్ (Navasena Foundation) అతనిపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఫౌండేషన్ తనది అని అతను చెప్పుకుంటున్నాడని, ఆయన మోసం చేశారని నిర్వాహకురాలు ఫరా (farah) ఆరోపించారు. 56 మంది పిల్లలను తనే చదివిస్తున్నట్లుగా చీటింగ్ చేశాడని తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ సింగింగ్ ప్రోగ్రాంలో ఈ పిల్లల ఫోటోలను యశస్వి ఉపయోగించుకున్నాడని, ఇందులో అబద్దాలు చెప్పినట్లు ఆరోపించారు. తనది కాని సంస్థను తనదని చెప్పుకోవడం, సామాజిక సేవ చేస్తున్నట్లు, పిల్లలను చదివిస్తున్నట్లు అబద్దాలు చెబుతున్నట్లుగా సింగర్ పైన ఆరోపణలు వచ్చాయి. నవసేన పౌండేషన్ కాకినాడలో ఉంది. దాదాపు 60 మంది అనాథ పిల్లలకు షెల్టర్ కల్పిస్తూ, చదివిస్తోంది ఈ ఎన్జీవో సంస్థ. కానీ ఈ సంస్థ తనది అని యశస్వి చెప్పుకుంటున్నాడని నిర్వాహకురాలు ఆరోపిస్తున్నారు. ఈ ఫౌండేషన్‌లోని పిల్లలతో ఫోటోలు దిగడంతో పాటు, దీనిని తానే నిర్వహిస్తున్నట్లుగా సింగింగ్ కాంపిటీషన్లో వినియోగించుకున్నాడని చెబుతున్నారు. చీటింగ్ చేస్తున్న యశస్వి పైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
ఫరా ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ… తమ సంస్థ రిజిస్టర్ అయిందని, యశస్వికి (Yasaswi Kondepudi) చెందినవారు వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్లారని చెప్పారు. ఈ పేరును తన ప్రోగ్రాంలో వినియోగించుకున్నాడని, దానిని ప్రోమోలో పెట్టుకున్నాడని చెప్పారు. అయితే ఇదంతా తమకు తెలియకుండా జరిగిందన్నారు. గత అయిదేళ్లుగా తాను సొంత డబ్బులతో పిల్లలను పోషిస్తూ, చదివిస్తున్నట్లు చెప్పారు. నవసేన ఫౌండేషన్‌కు ఏ సెలబ్రిటీ నుండి కూడా సహకారం లేదని స్పష్టం చేశారు. తమ సంస్థ పేరును ఉపయోగించుకోవడంతో పాటు, తానే నడుపుతున్నట్లు చీటింగ్ చేసినందున ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. యశస్వి ఎప్పుడూ ట్రస్ట్‌కు రాలేదని, ఆయనను నేరుగా ఎప్పుడూ చూడలేదన్నారు. ఫోన్లో మాత్రం ఇటీవల మాట్లాడినట్లు చెప్పారు. ప్రోగ్రాంలో తమ ఫౌండేషన్‌ను ఉపయోగించుకోవడంపై ప్రశ్నించగా, తాను కనుక్కొని, వచ్చి మాట్లాడుతానని చెప్పాడని వెల్లడించారు. ఆయన నిజానిజాలు తెలుసుకొని, వస్తే కానీ అసలు విషయం వెల్లడవుతుందన్నారు.
ఇటీవల ఓ షోలో పాల్గొన్న యశస్వి తాను నవసేన పేరుతో ఎన్జీవోను నడుపుతున్నానని, అందులో యాభై నుండి అరవై మంది పిల్లలను చదివిస్తున్నట్లు చెప్పారు. అయితే ఇది అబద్దమని సంస్థ చెబుతోంది. సరైన సమాధానం వారి నుండి రాకుంటే యాంకర్ పైన, యశస్వి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. యాజమాన్యం కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఎలా ప్రసారం చేస్తారని నిలదీశారు. విషయం తెలియగానే తాను క్షమాపణ చెప్పాలని అడిగానా, అతను పట్టించుకోలేదని ఆరోపించారు. సరిగమప సింగింగ్ షో ద్వారా యశస్వికి మంచి పేరు వచ్చింది. సెలబ్రిటీ అయ్యాడు. ఈ క్రేజ్త పలు ఈవెంట్స్‌లో తన గాత్రంతో అలరిస్తూ, ఎన్నో షోలు చేస్తూ బిజీగా ఉన్నారు. జాను సినిమాలోని లైఫ్ ఆఫ్ రామ్ పాటతో పేమస్ అయ్యారు. ఈ వివాదంపై యశస్వి కొండేపూడి స్పందించాల్సి ఉంది. పదేళ్ల వయస్సులోనే కీబోర్డులో ప్రావీణ్యం సంపాదించాడు. ప్రాణలింగం వద్ద ఆరు నెలల పాటు సింగింగ్‌లో శిక్షణ పొందారు. ఎస్పీ బాలు ద్వారా మరింత పేరు సంపాదించారు. పన్నెండేళ్ల వయస్సులోనే బాలు ప్రశంసలు కురిపించడంతో పాటు ఆశీర్వాదించారు.