కాకినాడ: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సర్వే నంబర్ల వారీగా స్టే ఆర్డరు జారీ చేసిన అక్రమ ఆక్వా చెరువులకు సంబంధించిన అఫిడవిట్‌ను జిల్లా మత్స్యశాఖ అధికారి ఎన్జీటీకి సమర్పించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. అనుమతులు లేని ఆక్వా చెరువులకు విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయాలన్నారు. కలెక్టరేట్లో బుధవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు.