TG: తమ ఎమ్మెల్యే కేటీఆర్ కనిపించడం లేదని గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు కోడె రమేశ్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ నియోజకవర్గంలో పలు గ్రామాలు నిత్యం సమస్యలతో సతమతమవుతున్నాయని.. అయినా కానీ నియోజకవర్గాన్ని పట్టించుకునే తీరిక మాత్రం తమ ఎమ్మెల్యే కేటీఆర్కు లేదని మండిపడ్డారు. రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్లను గాలికి వదిలేయడం సమంజసం కాదని ధ్వజమెత్తారు.