ప్రకాశం: కనిగిరి అర్బన్ కాలనీలో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభానికి విచ్చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు కనిగిరిలో నుంచి ఘన స్వాగతం లభించింది. భారీ బైక్ ర్యాలీతో అర్బన్ కాలనీకి మంత్రి వెంట టీడీపీ శ్రేణులు వెళ్లారు. చెక్ పోస్ట్ సెంటర్ నుంచి అర్బన్ కాలనీ వరకు భారీ కాన్వాయ్‌తో అర్బన్ కాలనీకి మంత్రి రవికుమార్ చేరుకున్నారు.