SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలో సామాజిక తనిఖీపై ప్రజా వేదిక సోమవారం ప్రారంభమైంది. స్థానిక ఎంపీడీవో మల్సూర్ నాయక్, ఏపీఓ బసవరాజ్ నిర్వహణలో EGS అభివృద్ధి పనుల సోషల్ ఆడిట్ పై చర్చించారు. గత 10 రోజుల నుండి మండలంలోని 27 జీపీల్లో చేపట్టిన ఉపాధి హామీ పనులు, వేతనాల చెల్లింపులపై DRPలు సర్వే చేసిన నివేదికలను చదివి వినిపించారు.