GNTR: పొన్నూరు మండలం వెల్లలూరు గ్రామం జీబీసీ రోడ్డుపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. పొన్నూరు వైపు నుంచి ముగ్గురు యువకులు బైక్పై గుంటూరు వైపు వెళుతుండగా అతివేగంగా వస్తున్న కారు బైక్ను ఢీకొంది. ఘటనలో షేక్ ఖాసీం(25) అక్కడకక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.