రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. అల్వార్ జిల్లా రాజ్ఘర్లో ఓ మత ప్రబోధకుడు ఏకంగా ప్రార్థనా స్థలంలోనే ఐదేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లికి తెలపడంతో.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ కీచకుడిని అరెస్టు చేశారు. తన ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిని ఆ నిందితుడు పిలిచాడు. అనంతరం ఆ బాలికను ప్రార్థనా స్థలంలోకి తీసుకెళ్లి బలాత్కారం చేశాడు.