నాని ‘సరిపోదా సనివారం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నటుడు SJ సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు సినీ ప్రియుల మధ్య సోషల్ మీడియాలో విబేధాలు సృష్టిస్తున్నాయి. SJ సూర్య తెలుగు సినిమాలలోని ప్రతి మాస్ ఫిల్మ్ ‘రజనీకాంత్’ బాషాను పోలి ఉంటాయని కామెంట్స్ చేసారు. చిరంజీవి ఇంద్ర’, బాలకృష్ణ ‘నరసింహ నాయుడు’ వంటి చిత్రాలు కూడా బాషా తరహాలోనే ఉంటాయని పేర్కొన్నారు. ఇక, ప్రభాస్ ‘బాహుబలి’ కూడా ఇలాంటి స్క్రీన్‌ప్లేలో ఉంటుందని అన్నారు.
ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. తెలుగు సినీ అభిమానులు దీనిపై స్పందిస్తున్నారు. కొంతమంది, తమిళ సినిమాల మధ్య కూడా ఇలాంటి స్క్రీన్‌ప్లే వున్నాయని చెప్తున్నారు, ఇంకా బాషా ప్రత్యేకమైనది కాదని, అది అమితాబ్ బచ్చన్ ‘హమ్’ నుండి ప్రేరణ పొందింది అని వ్యాఖ్యానిస్తున్నారు.
సినిమా పరిశ్రమలో ప్రతి బ్లాక్‌బస్టర్ సినిమాకు తన ప్రత్యేకమైన ప్రభావం ఉంటుంది. బాషా, దాని విజయం, ప్రభావం మరియు స్టైల్ విషయంలో ప్రత్యేకంగా నిలుస్తుంది. అన్ని చిత్రాలు ఒకే విధమైన స్క్రీన్‌ప్లేను అనుసరించలేవు, కానీ కొన్ని సినిమాలు గత విజయాలతో ప్రభావితం అవుతాయి. సరిపోదా శనివారం ఎస్ జె సూర్య ప్రధానపాత్రలో నటిస్తున్నారు. స్పైడర్ తరువాత సూర్య నటిస్తున్న స్ట్రెయిట్ సినిమా ఇదే. 29వ తారీఖున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవవుతుంది.