Tinted Windows : కారు డోర్ అద్దాలకు టింట్ వాడితే నేరమా?
చాలా మందికి కారు అద్దాలకు టింట్(సన్ ఫిల్మ్)ని అంటిస్తూ ఉంటారు. కొన్నిసార్లు పోలీసులకు పట్టుబడిపోతుంటారు. అసలు ఈ విషయమై చట్టం ఏం చెబుతోంది? ఇందుకు ప్రత్యామ్నాయాలేంటి రండి తెలుసుకుందాం.
Is Tinted Windows For cars Illegal : చాలా మంది తమ కార్ల అద్దాలకు టింట్‌ని అతికిస్తూ ఉంటారు. ఇది డార్క్ బ్లాక్ కలర్లో ఉండటం వల్ల ఎండ లాంటివి నేరుగా కారు లోపల కూర్చున్న వారిపై పడకుండా ఉంటాయి. కాబట్టి వీటిని వాడేందుకు చాలా మంది మొగ్గు చూపుతుంటారు. అయితే పోలీసులు పట్టుకుంటే మాత్రం వీటికి జరిమానాలు తప్పవు. ఎందుకంటే చట్ట ప్రకారం ఇది నేరం. మోటార్ వాహన చట్టం(LAW) 1988 ప్రకారం కారులోని అద్దాలకు 100 శాతం టింట్ చేయించడం నేరం. కచ్చితంగా వెహికిల్‌లోని వెనుక, ముందు, అద్దాలకు 70 శాతం స్పష్టమైన విజబిలిటీ ఉండాలి. అలాగే కారు డోరు(WINDOWS) సైడు అద్దాలకు సైతం 50 శాతం స్పష్టమైన విజిబిలిటీ ఉండాలి. అంటే బయటి నుంచి కారులోకి అంతా చూడగలిగేలా ఉండాలి. ఈ విజబిలిటీ తగ్గేలా గనుక కారు అద్దాలకు సన్ ఫిల్మ్‌లు వేయించినట్లతే వారు శిక్షార్హులు.
ఈ ప్రమాణాలకు అనువుగా కొన్ని కార్ల కంపెనీలు అద్దాలను అమర్చి అందిస్తుంటాయి. మారుతీ సుజుకీ, టయోటా కిర్లోస్కర్ లాంటివి వాహన చట్టానికి అనువుగా ఆకుపచ్చ లేత రంగు టింట్ ఉన్న కిటికీ అద్దాలను అందిస్తున్నాయి. దీని ద్వారా కారులోకి ఎండలోని అతినీలలోహిత కిరణాల లాంటివి ప్రవేశించకుండా ఉంటాయి. అలాగే మన దేశంలో జడ్, జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత ఉన్న వారు మాత్రమే ఇలా అద్దాలకు నలుపు ఫిల్మ్‌ని వాడొచ్చు. ఇది చట్ట వ్యతిరేకం ఏమీ కాదు. ఇందుకు పోలీసులు, కేంద్ర హోం శాఖలు అనుమతుల్ని మంజూరు చేస్తాయి. సాధారణ వ్యక్తులు ఎవరైనా ఇలా కారు అద్దాలను డార్క్ టింట్‌తో కవర్ చేసినట్లైతే మొదటి సారి రూ.100 జరిమానా(fine) వేస్తారు. రోండోసారి రూ.300 వేస్తారు. మూడోసారి సైతం ఇదే కంప్లైంట్‌తో పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్‌ని క్యాన్సిల్ చేసే అధికారం అధికారులకు ఉంటుంది.
ఇక ఈ టింట్కి(TINTE) ప్రత్యామ్నాయంగా ఏం వాడొచ్చనేది తెలుసుకుందాం. మార్కెట్లో దొరికే సన్ షేడ్స్‌ని మనం వీటికి బదులుగా వాడుకోవచ్చు. అలాగే ముదురు ఆకుపచ్చ యూవీ కట్ గ్లాస్‌ని సైతం ఇన్‌బిల్ట్‌గా వేయించుకోవచ్చు. ఇవి అతినీలలోహిత కిరణాలను 80 శాతం వరకు తగ్గిస్తాయి. అలాగే కొన్ని సెడాన్, ఎస్‌యూవీల్లో గ్లాసుల దగ్గర ముడుచుకునే డ్రాప్ షేడ్స్‌ని కంపెనీలు ఇస్తున్నాయి. వీటినైనా ఫిట్ చేయించుకోవచ్చు.