గత రెండు రోజులుగా సోషల్ మీడియా మొత్తం పుష్ప సినీమా గురించే మాట్లాడుతుంది. అల్లు అర్జున్ – సుకుమార్ కి పడట్లేదు అని, సినిమా షూటింగ్ అర్ధంతరంగా ఆగిపోయి హీరో, డైరెక్టర్లు ఇద్దరూ వారి ఫ్యామిలీలో ఫారిన్ వెళ్లిపోయారని ఒకటే చర్చ.
వాళ్ళు ఫారిన్ వెళ్లిన మాట వాస్తవమే కాని, నిజానికి ఇది ముందుగానే ప్లాన్ చేసుకున్న బ్రేక్ అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎడిటింగ్ పనులు జరుగుతున్న వేళ ఇలా డైరెక్టర్, హీరోలు బ్రేక్ తీసుకుని ఫ్యామిలీస్ తో గడపటం కొత్తేం కాదు. ఈ నెలాఖరుకు సుకుమార్, బన్నీ ఇద్దరూ ఇండియా వస్తారని మళ్ళీ పుష్ప2 షూటింగ్ యధావిధిగా జరుగుతుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
పళ్ళు ఉన్న చెట్టుకే రాయలు పడతాయని సామెత మనందరికీ తెలుసు… అలా 3క్రేజ్ ఉన్న సినిమానే న్యూస్ లో ఉంటుంది. ఒకవేళ పుష్ప2 అనే సినిమా వేరే కారణాల వల్ల డిసెంబర్ లో రాకపోయినా…ఆ సినిమాకి ఉన్న క్రేజ్, యూఫోరియా వల్ల బిజినెస్ కొంచెం కూడా ఎఫెక్ట్ అవ్వదనేది వాస్తవం.
ఎందుకంటే ఈ సినిమాకు తెలుగు, తమిళ, మలయాళం భాషలలో ఉన్న క్రేజ్ ఒక ఎత్తు… నార్త్ ఇండియాలో, మరీ ముఖ్యంగా బీహార్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి హిందీ మాస్ సర్క్యూట్స్ లో పుష్ప మ్యాజిక్ వేరే లెవెల్ లో ఉంది. సినీమా యూనిట్ సభ్యుల ప్రకారం డిసెంబర్ 6న సినిమా విడుదల అవడం పక్కాగా కనిపిస్తుంది. బన్నీ సుకుమార్‌ల ఫ్రెండ్షిప్ చాలా దీప్ 5అని, చిన్న చిన్న కారణాలకు గొడవపడే వాళ్ళు కాదని వారు చెప్తున్న మాట