Rainy Season: తరచూ జలుబుకి గురి కాకుండా ఉండాలంటే.. ఇలా చేయండి
వర్షాకాలంలో చాలామంది తరచుగా జలుబుకి గురవుతారు. వర్షంలో కొంచెం తడిచిన చాలు జ్వరం, దగ్గు, జలుబు, గొంతు మంట అన్ని లక్షణాలు కనిపిస్తాయి. మరి ఈ కాలంలో జలుబుకి గురి కాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.
Rainy Season: జలుబు చేసినప్పుడు హైడ్రేట్‌గా ఉండాలి. నీరు ఎక్కువగా తాగుతూ, మూలికా టీలు, గోరు వెచ్చని నీరు తాగడం వల్ల గొంతు నొప్పిని తగ్గించుకోవచ్చు. జలుబుతో ఉన్న కొంత విశ్రాంతి అవసరం. అతిగా శ్రమించకుండా విశ్రాంతిగా ఉండటం మంచిది. జలుబు చేసినప్పుడు హ్యూమిడిఫైయర్ను గదిలో ఉపయోగించండి. గాలికి తేమను జోడించడం వల్ల ఊపిరి పీల్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి పోషకమైన ఆహారాలు తినడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. జలుబు వైరస్‌తో పోరాడటానికి అవసరమైన పోషకాలను మీ శరీరానికి అందించడానికి సహాయపడుతుంది. ఆహారంలో విటమిన్ సి, జింక్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి. కేవలం వైద్యుల సూచనల మేరకే మందులను ఉపయోగించాలి.