»Stop The Russia Ukraine War America Appeals To India
America: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపండి.. భారత్‌కు అమెరికా విజ్ఞప్తి
రష్యా-ఉక్రెయిన్ మధ్య రెండు సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధాన్ని ఆపగల సత్త భారతదేశానికి మాత్రమే ఉందని అగ్రరాజ్యం అమెరికా అంటున్న విషయం తెలిసిందే. తాజాగా అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మరోసారి అదే విషయాన్ని పత్రికంగా ముఖంగా చెప్పారు. రష్యాకు భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు.
Stop the Russia-Ukraine war.. America appeals to India
America: రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగల సత్తా భారత్‌కు మాత్రమే ఉందని అమెరికా మరోసారి వ్యాఖ్యానించింది. రెండు సంవత్సరాలుగు కొనసాగుతున్న ఈ యుద్ధం అంతర్జాతీయంగా చాలా అంశాలపై ప్రభావం చూపుతోందని ఈ వార్ అతిత్వరగా ఆగిపోవాలి అని అమెరికా అంటోంది. భారత్ తలుచుకుంటే ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని విరమించేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరపగలదు అని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు. ఎలాగైనా ఈ మారణహోమాన్ని ఆపాలని భారత్‌కు అగ్రరాజ్యం విజ్ఞప్తి చేసింది. దీనికి పుల్‌స్టాప్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ సందర్భంగా భారత్-రష్యా సంబంధాల గురించి ప్రస్తావిస్తూ.. ఢిల్లీ, మాస్కో మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని, యుద్ధానికి చరమగీతం పాడేలా భారత్ చర్యలు తీసుకోవాలని సూచించింది.
అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సోమవారం విలేకరుల సమావేశంలో ఈ విధంగా మాట్లాడారు. ఢిల్లీ-మాస్కోల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి. ప్రధాని మోడీ చెబితే రష్యా అధ్యక్షుడు వింటాడని పేర్కొన్నారు. యూఎన్ చార్టర్‌ను గౌరవించాల్సిన బాధ్యత దేశ అధ్యక్షునిగా పుతిన్‌కు ఉందని భారత్ గుర్తు చేస్తే బాగుంటుందని కోరారు. రష్యా చట్టవిరుద్ధంగా యుద్ధం చేస్తుందని ఆరోపించారు. ఉక్రెయిన్ను గౌరవించాలని, ఆ దేశ సార్వభౌమత్వానికి మర్యాద ఇవ్వాలని పుతిన్‌కు భారత్ సూచించాలని మిల్లర్ చెప్పారు.