Gold and Silver Rates Today : బంగారం, వెండి ధరలు గత కొన్ని రోజులుగా అప్ ట్రెండ్‌లోనే నడుస్తున్నాయి. వరుసగా గత మూడు రోజులుగా పెరుగుతూ ఉన్న వీటి ధరలు శనివారం మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పసిడి అయితే అతి స్వల్పంగా మాత్రమే తగ్గింది. రూ.31 తగ్గడంతో దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.75,269కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో సైతం దీని ధర ఇలాగే ఉంది. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదుల్లోనూ పది గ్రాముల పసిడి రూ.75,269గానే ఉంది. అయితే ఈ ధర మార్కెట్ ప్రారంభ సమయంలో నమోదైనది మాత్రమే. తర్వాత మళ్లీ మరే అవకాశం ఉంటుంది.
గత వారం పది రోజులుగా వెండి ధరలు(Silver RateS) మాత్రం పైపైకి ఎగబాకుతూనే ఉన్నాయి. దాదాపుగా పది రోజుల తర్వాత దీని ధర కాస్త తగ్గిందని చెప్పవచ్చు. నేడు ఇది రూ.674 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.94,609కి చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదుల్లోనూ వెండి ధరలు దాదాపుగా ఇలాగే ఉన్నాయి. వెండి, బంగారం కొనుగోలు చేయాలని భావించే వారు పై ధరలకు అదనంగా జీఎస్టీ, మజూరీల్లాంటివి సైతం చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. శుక్రవారం ధర మీద పసిడి శనివారం 2 డాలర్లు పెరిగింది. దీంతో ఔన్సు స్పాట్ గోల్డ్ 2409 డాలర్లు పలుకుతోంది. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఔన్సు వెండి ప్రస్తుతం 30.81 డాలర్లుగా ఉంది.