»The Quality Of Tirupati Prasad Has Increased Ttd Eo
TTD: తిరుపతి ప్రసాదంలో నాణ్యత పెరిగింది.
తిరుమలకు వచ్చే భక్తులకు అందించే ప్రసాదంలో నాణ్యత పెరిగిందని టీటీడీ ఈవో జె. శ్యామలరావు వెల్లడించారు. ఆలయంలో ప్రతీ రోజు 2 లక్షల మందికి అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు మీడియాతో పంచుకున్నారు.
The quality of Tirupati Prasad has increased.. TTD EO
TTD: తిరుమల(Tirumala) తిరుపతికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకుంటున్నట్లు, అలాగే స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు రుచికరమైన అన్న ప్రసాదాలు(Annaprasadalu) అందిస్తున్నామని టీటీడీ (TTD) ఈవో జె.శ్యామలరావు చెప్పారు. దీనికోసం ఇటీవల తీసుకున్న చర్యల గురించి తెలిసిందే. ముఖ్యంగా భక్తులకు ఎలాంటి లోటు లేకుండా చూడాలని, వారికి అందించే తీర్థప్రసాదాల్లో కూడా నాణ్యత పెంచబోతున్నట్లు ఇటీవల ఈవో చెప్పారు. అందులో భాగంగా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని జేఈవో వీరబ్రహ్మం, ఈవో ఇద్దరు కలిసి బుధవారం తనిఖీ చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుమలలో ప్రతిరోజు 2 లక్షల మందికి అన్నప్రసాదాలను టీటీడీ తయారు చేస్తోందని పేర్కొన్నారు. ఇంకా నాణ్యమైన, రుచికరమైన అన్న ప్రసాదాలు అందించేందుకు టీటీడీ కృషి చేస్తుందని వెల్లడించారు. అందుకోసం పనిభారం తగ్గించడానికి కూరగాయలు కట్ చేయడానికి అధునాతనమైన శాస్త్ర, సాంకేతిక పద్ధతిని వాడుతున్నట్లు చెప్పారు. అలాగే ముడి సరుకుల నిల్వ చేసేందుకు, ఆహారపదర్థాలు తయారు చేసే గదిని శుభ్రంగా చూసుకునేందుకు కూడా మిషన్లు వాడుతున్నట్లు చెప్పారు. అంతే కాదు ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు నిపుణులైన అధికారులను నియమిస్తున్నట్లు చెప్పారు. అలాగే అన్నప్రసాద విభాగంలో పనిచేసే సిబ్బందిని పెంచతున్నట్లు వెల్లడించారు. దేశంలోని ప్రముఖ చెఫ్‌లు, క్యాటరింగ్ నిపుణలతో సైతం చర్చలు జరుపుతుందని ఈవో జె. శ్యామలరావు తెలిపారు.