సొంత ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనకు కేటాయించిన గన్ మెన్లను వెనక్కి పంపించారు. ప్రభుత్వం తనకు భద్రత తగ్గించిన కారణంగా తానే రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానంటూ కోటంరెడ్డి తనకు గన్ మెన్లు అక్కర్లేదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఆయన గన్ మన్లు తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. కోటంరెడ్డిని వదిలి వెళ్లలేక కన్నీటిపర్యంతమయ్యారు. కోటంరెడ్డి కూడా చలించిపోయారు. గన్ మెన్లను హత్తుకుని ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి గన్ మెన్లను వెనక్కి ఇచ్చేయాలన్న తన ప్రకటనను సినిమా డైలాగ్ అనుకోవద్దన్నారు.