సాధారణంగా పిడుగుల వర్షం పడుతుంది. దీని గురించి అందరూ వినే ఉంటారు. మరి ఎప్పుడైన యాసిడ్ వర్షం గురించి విన్నారా? మరి ఈ యాసిడ్ వర్షం అంటే ఏమిటి? ఎలా వస్తుంది? దీని వల్ల ఏదైనా ప్రభావం ఉందో తెలుసుకుందాం.
సాధారణ వర్షం కంటే యాసిడ్ వర్షం భిన్నమైన లక్షణాలను కలిగి ఉంటుంది. యాసిడ్ వర్షం అనేది సల్ఫ్యూరిక్ లేదా నైట్రిక్ యాసిడ్ వంటి ఆమ్ల భాగాలను కలిగి ఉంటుంది. దీనినే యాసిడ్ వర్షం లేదా ఆమ్లవర్షం అంటారు. ఇది వాతావరణం నుంచి తడి లేదా పొడి రూపంలో నేలపైకి వస్తుంది. వర్షం రూపంలో కాకుండా మంచు, పొగమంచు, వడగళ్లు లేదా ఆమ్ల ధూళి రూపంలో కూడా కొన్నిసార్లు జరుగుతుంది. ఆమ్ల వర్షం విషయానికి వస్తే గాలిలో కొన్ని కాలుష్య కారకాలు ఉంటాయి. ఇవి ఆమ్లంగా మారతాయి. దీనిని ఆమ్ల నిక్షేపణ అని కూడా పిలుస్తారు.
ఇతర రూపం పొడి నిక్షేపణ, వాయువులు, ధూళి కణాలు ఆమ్లంగా మారినప్పుడు సంభవిస్తుంది. యాసిడ్ నిక్షేపణ భవనాలు, కార్లు, చెట్లు, నీటి వనరులపై పడిపోతుంది. అయితే ఇది నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదలైనప్పుడు గాలి వాటిని తీసుకెళ్లినప్పుడు ఆమ్ల వర్షం సంభవిస్తుంది. అవి ఆక్సిజన్, నీరు, ఇతర రసాయనాలతో చర్య జరిపి నైట్రిక్, సల్ఫ్యూరిక్ ఆమ్లాలను ఏర్పరుస్తాయి. నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ డయాక్సైడ్ అగ్ని పర్వతాల వంటి సహజ వనరుల నుంచి తక్కువగా వస్తుంది.
మిగతావి ఎలక్ట్రిక్ పవర్ జనరేటర్లు, వాహనాల తయారీ, చమురు శుద్ధి కర్మాగారాలు, ఇతర పరిశ్రమల నుంచి వస్తాయి. వీటి వల్ల సరస్సులు, నదులు ప్రభావితం అవుతాయి. యాసిడ్ సెన్సిటివ్ ప్రాంతాల నేలలు తక్కువ బఫరింగ్ సామర్థ్యం లేదా తక్కువ యాసిడ్ న్యూట్రలైజింగ్ కెపాసిటీ ఉంటుంది. అలాగే అధిక ఆమ్లత్వం మౌళిక పాదరసం మిథైల్ మెర్క్యూరీగా మారడాన్ని పెంచుతుంది. మిథైల్ పాదరసం సాంద్రతలు హానికరమైన స్థాయికి పెరుగుతాయి. ప్రభుత్వ అధికారులు తాజా, సముద్ర జలాల నుంచి చేపల వినియోగాన్ని తగ్గించాలని సిఫార్సు చేస్తున్నారు. వీటివల్ల ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనేక చెట్ల జాతుల క్షీణతకు కూడా దారితీస్తుంది.