»Pm Modi Do Not Behave Like Rahul Gandhi Modi Advises Mps
PM Modi: రాహుల్ గాంధీలా ప్రవర్తించవద్దని.. ఎంపీలకు మోదీ సూచన
ప్రతిపక్ష నేత హోదాలో ఉండి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సభలో అవమానకరంగా ఉన్నాయని మోదీ అన్నారు. ఆయనలా ఎవరూ ప్రవర్తించవద్దని.. ఎన్డీయే ఎంపీలు పార్లమెంటరీ విధానాలను పాటించాలని సూచించారు.
PM Modi: Do not behave like Rahul Gandhi.. Modi advises MPs
PM Modi: బీజేపీ నేత వరుసగా మూడోసారి ప్రధాని కావడం కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని నరేంద్రమోదీ విమర్శించారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉండి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సభలో అవమానకరంగా ఉన్నాయని మోదీ అన్నారు. ఆయనలా ఎవరూ ప్రవర్తించవద్దని.. ఎన్డీయే ఎంపీలు పార్లమెంటరీ విధానాలను పాటించాలని సూచించారు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన సభ్యులు నిబంధనల విషయంలో సీనియర్లను అడిగి తెలుసుకోవాలని మోదీ సూచించారు.
నిన్న పార్లమెంట్లో ప్రతిపక్ష నేత ప్రవర్తించిన తీరు మర్యాదగా లేదని, స్పీకర్ స్థానాన్ని అవమానించారని మంత్రి రిజిజు అన్నారు. కొన్ని దశాబ్దాల పాటు ప్రధాని కూర్చీని ఓ కుటుంబం గుప్పిట్లో ఉంచుకుంది. కానీ మా ప్రభుత్వం దేశ నేతలందరికీ సమాన గౌరవం ఇస్తుందని తెలిపారు. పార్టీలకు అతీతంగా దేశంలోని ప్రతీ ఎంపీ తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి సంగ్రహాలయ్ను సందర్శించాలి. అందులో మాజీ ప్రధాని నెహ్రూ నుంచి మోదీ వరకు ప్రధానుల ప్రయాణాన్ని అందంగా ప్రదర్శించారు. వాళ్ల జీవిత విశేషాలను మనమంతా తెలుసుకోవాలని ప్రధాని ఎంపీలకు సూచించారని రిజిజు తెలిపారు.