»Special Chapter On Actress Tamanna On Bangalore School Books
తమన్నాపై స్కూల్ పుస్తకాల్లో పాఠం.. తీసేయాలంటే టీసీనే..?
తమన్నా గురించి ఓ స్కూల్ పాఠ్య పుస్తకాల్లో పాఠం ఉండడంతో.. పేరెంట్స్ షాక్ అయ్యారు. అరె తమన్నా పై పాఠం ఏంటి? అని అడిగితే.. మీ పిల్లలకు టీసీ ఇస్తామని బెదిరిస్తున్నారట. ఇంతకీ ఎక్కడ? తమన్న పై పాఠం చెబుతున్నారు.
తమన్నా గురించి ఓ స్కూల్ పాఠ్య పుస్తకాల్లో పాఠం ఉండడంతో.. పేరెంట్స్ షాక్ అయ్యారు. అరె తమన్నా పై పాఠం ఏంటి? అని అడిగితే.. మీ పిల్లలకు టీసీ ఇస్తామని బెదిరిస్తున్నారట. ఇంతకీ ఎక్కడ? తమన్న పై పాఠం చెబుతున్నారు.
హాట్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. తెలుగులో దాదాపుగా స్టార్ హీరోలందరితోను నటించింది తమన్నా. అయితే.. కెరీర్ స్టార్టింగ్‌లో గ్లామర్ ట్రీట్ కాస్త తక్కువగా ఇచ్చిన తమన్నా.. ఇప్పుడు మాత్రం తగ్గేదేలే అంటోంది. ఓ వెబ్ సిరీస్‌లో అయితే రెచ్చిపోయింది. ఈ విషయంలో అమ్మడి పై ట్రోలింగ్ కూడా జరిగింది. కానీ యాక్టర్ అన్నప్పుడు ఏదైనా చేయాల్సిందేనని.. హాట్ టాపిక్ అవుతునే ఉంది తమన్నా. అయితే.. ఈసారి మాత్రం తమన్నా పై ఏకంగా పాఠ్య పుస్తకాలు రావడం మరింత హాట్ టాపిక్‌గా మారింది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సమీపంలోని హెబ్బల్‌లోని సింధీ హైస్కూల్లో 7వ తరగతి పాఠ్యాంశాల్లో తమన్నా జీవిత విశేషాలతో ఓ ప్రత్యేక పాఠాన్ని పొందు పరిచారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న సదరు విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. స్థానిక బాలల హక్కుల రక్షణ సంఘంలో ఫిర్యాదు చేశారు. దీంతో.. ఈ వ్యవహారం దేశమంతట హాట్ టాపిక్‌గా మారింది.
అసలు సినిమా హీరోయిన్ల గురించి, అందులోను గ్లామర్ బ్యూటీలను చూసి.. పిల్లలు ఎలా ఆదర్శ వంతులవుతారని, వారిని చూసి విద్యార్థులు ఏం నేర్చుకుంటారని.. మండిపడుతున్నారు పేరెంట్స్. ఒకవేళ చెప్పాలనుకుంటే గౌరవంగా ఉండే కళాకారులు, ఉన్నత స్థానాల్లో ఉన్న వారు చాలామందే ఉన్నారని అంటున్నారు. అయితే.. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే.. తమన్నా పాఠ్యాంశాన్ని వ్యతిరేకించినందుకు.. తమ పిల్లలకు టీసీ ఇచ్చి పంపేస్తామంటూ.. స్కూల్ యాజమాన్యం భయపెడుతోందట. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్స్ కాస్త షాక్ అవుతున్నారు.