»Cm Chandrababu Cm To Release White Paper On Polavaram Today
CM Chandrababu: నేడు పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. చంద్రబాబు ఈరోజు మధ్యాహ్నం పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసి వివరాలను వెల్లడించనున్నారు.
CM Chandrababu: CM to release white paper on Polavaram today
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఏడు ప్రభుత్వ శాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈక్రమంలో ఈరోజు మధ్యాహ్నం పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసి వివరాలను వెల్లడించనున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి క్షేత్రస్థాయి పర్యటనకు పోలవరం వెళ్లి.. అక్కడ అధికారులతో మాట్లాడి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్యంసంపై వివరాలను శ్వేతపత్రం ద్వారా వెల్లడించనున్నారు. ప్రాజెక్టు విషయంలో ఉన్న నిజాలను ప్రజలకు తెలియజేయనున్నారు. జగన్ విధానాల వల్ల జరిగిన నష్టం, ముందున్న సవాళ్లపై సమగ్ర వివరాలతో శ్వేతపత్రం రూపొందించారు. మరోవైపు అన్ని ప్రభుత్వ శాఖలపై ఈరోజు నుంచి ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించనున్నారు. అలాగే సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై ఈరోజు తొలి సమీక్ష చేయనున్నారు. వెంటనే చర్యలు చేపట్టాల్సిన వాటిపై కూడా అధికారులతో చర్చించనున్నారు.