»Darling Just Killed It Ss Rajamouli Praises Prabhas Performance In Kalki 2898 Ad Applauds Cast For Great Support
Kalki 2898 AD : ‘డార్లింగ్ చంపేశాడంతే’.. అంటున్న రాజమౌళి
ప్రభాస్ కల్కి మూవీ గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బంపర్ హిట్ టాక్ని సొంతం చేసుకుంది. ఈ పాన్ ఇండియా మూవీపై దర్శకధీరుడు రాజమౌళి సైతం స్పందించారు. ఆయన ఏమన్నారంటే?
Kalki 2898 AD Rajamouli Review : బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఘనుడిగా దర్శక ధీరుడు రాజమౌళి గుర్తింపు పొందారు. అంతటి పెద్ద దర్శకుడు కల్కి సినిమా గురించి ఏం చెబుతారన్నది అందరికీ ఆసక్తికరంగానే ఉంటుంది. గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన కల్కి 2898 ఏడీ(KALKI 2898 AD) సినిమా మంచి టాక్‌తో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై రాజమౌళి సైతం స్పందించారు.
వరల్డ్ వైడ్‌గా సూపర్ రెస్పాన్స్ సాధించిన కల్కి మూవీపై రాజమౌళి(RAJAMOULI) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ద్వారా మరో ప్రపంచానికి రూపం తీసుకొచ్చిన తీరు తనను ఎంతో ఆకట్టుకుందన్నారు. అద్భుతమైన సెట్టింగులు, గ్రాఫిక్స్ తనను వేరు వేరు కాలాలకు తీసుకుని వెళ్లాయని అన్నారు. ప్రభాస్‌ని ఆయన ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ గురించి ఆయన స్పందించారు. ‘డార్లింగ్ తనదైన టైమింగ్‌తో, యాక్టింగ్‌తో చంపేశాడంతే’ అంటూ ప్రశంసించారు.
ఈ సినిమాలో(KALKI 2898 AD) అమితాబ్, కమల్, దీపిక తదితరులు సైతం తమ పాత్రల్లో చక్కగా నటించారంటూ రాజమౌళి(RAJAMOULI) కితాబిచ్చారు. చివరి అరగంట అయితే తాను పూర్తిగా మరో ప్రపంచంలోకి వెళ్లిపోయినట్లు తెలిపారు. ఇంతటి ప్రతిభ కనబరిచి, కృషి చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కి, వైజయంతి మూవీస్ టీంకి శుభాకాంక్షలు చెప్పారు. చిత్ర బృందం ఎంతో కష్టపడి పని చేసిందంటూ పొగడ్తల వర్షం కురిపించారు.