Kalki 2898 AD: ప్రసాద్ మల్లీప్లెక్స్ వద్ద ప్రభాస్ బుజ్జి సందడి
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం ఈ రోజు విడుదలైంది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ సంపాదించుకుంది. అయితే ఈ సినిమాలో ఉన్న వెహికల్ బుజ్జి హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ దగ్గర సందడి చేస్తోంది.
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం ఈ రోజు విడుదలైంది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాలో ఉన్న బుజ్జి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకుంటే సినిమాకు విడుదలకు ముందే ప్రభాస్ బుజ్జిని పరిచయం చేశారు. ఈ బుజ్జిని విడుదల చేయగా అభిమానులు దీనికి ఆకట్టుకున్నారు. అయితే ఈ వెహికల్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇండియాలోని అన్ని ప్రాంతాలను చుట్టుకుని వచ్చింది.
చివరిగా బుజ్జి హైదరాబాద్‌కు చేరింది. ఈరోజు కల్కి సినిమా విడుదల సందర్భంగా బుజ్జిని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ నిర్వహాకులు ప్రదర్శనకు ఉంచారు. అయితే ఈ బుజ్జిని చూసేందుకు సినీ ప్రేమికులు చూడటానికి వెళ్లారు. దీంతో ప్రసాద్స్ మల్టీప్లెక్స్ దగ్గర సందడి నెలకొంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో కొందరు షేర్ చేశారు. దీంతో బుజ్జిని చూడటానికి అభిమానులు రావడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.