ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఏం అరవింద్ కేజ్రీవాల్‌కు మళ్లీ చుక్కెదురైంది. ఈ కేసులో సూప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సైతం ఉపసంహరించుకుంది. అలాగే సీబీఐ అరెస్టు చేయడానికి అనుమతి ఇచ్చింది.
Arvind Kejriwal in CBI custody.. Withdrawal of bail petition
Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ కేసు (Delhi Liquor Policy Case)లోసీఏం అరవింద్ కేజ్రీవాల్‌కు మళ్లీ చుక్కెదురైంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను సీబీఐ (CBI) అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ బెయిల్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనున్న తరుణంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం ట్రయల్ కోర్టులో ప్రవేశ పెట్టారు. విచారణ తరువాత కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు కోర్టును అనుమతి కోరింది. దీనికి సంబంధించిన పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేసింది సీబీఐ. కోర్టు అనుమతి ఇవ్వడంతో సీబీఐ అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది.
తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో బెయిల్‌పై స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో కేజ్రీవాల్ తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు సీబీఐ అరెస్టు చేయడంతో తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసి తీహార్ జైలులో ఉంచింది. మార్చి 21న ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ ఇప్పుడు సీబీఐ చేతులో ఉన్నారు.