Gold and Silver Rates Today : బంగరాం కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే రోజూ వాటి ధరలపై ఓ కన్నేసి ఉంచండి. నేటి వెండి, బంగారం ధరల్ని తెలుసుకునేందుకు ఇది చదివేయండి. దేశీయ మార్కెట్లో మంగళవారం పసిడి ధర నామ మాత్రంగా తగ్గింది. రూ.20 తగ్గింది. దీంతో నేడు 24 క్యారెట్ల పది గ్రాములప పసిడి ధర రూ.73,910కి చేరుకుంది.
చదవండి : నిరాహారదీక్ష… క్షీణించిన దిల్లీ మంత్రి ఆతిషి ఆరోగ్యం
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర చోట్ల కూడా నేడు పది గ్రాముల బంగారం ధర (Gold Rate) రూ.రూ.73,910గానే కొనసాగుతోంది. అయితే ఈ ధర మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నది మాత్రమే. తర్వాత అది మళ్లీ మారే అవకాశాలు లేకపోలేదు. ధర తగ్గినప్పుడు బంగారు వస్తువులు కొనుక్కోవాలనే ఆలోచనలో ఉన్న వారు ఈ ధరకు తోడుగా మజూరీ, జీఎస్టీ లాంటివి కూడా చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.
చదవండి : శంషాబాద్లో కలకలం సృష్టిస్తున్న చిరుత
ఇక వెండి విషయానికి వస్తే నేడు ధర కాస్త తగ్గింది. కిలో వెండి ధర(Silver Rate) మంగళవారం రూ.435 తగ్గుముఖం పట్టింది. దీంతో నేడు కేజీ సిల్వర్ రేటు రూ.90,845గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. బంగారం, వెండి రెండూ కూడా మార్కెట్ ప్రారంభ సమయానికి స్వల్పంగా తగ్గుముఖం పట్టడం గమనార్హం. ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం ఔన్సు స్పాట్ గోల్డ్ 2325 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి 29.46 డాలర్లుగా ఉంది.

