»Brs Party Mlas Who Left The Party Brs Party Will Approach The Supreme Court
BRS Party: పార్టీ వీడిన ఎమ్మెల్యేలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న బీఆర్ఎస్ పార్టీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దీనికోసం బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.
BRS Party: MLAs who left the party..BRS Party will approach the Supreme Court
BRS Party: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్‌లో చేరుతున్న ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆ పార్టీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరి మూడు నెలలు పూర్తి అయిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది.
సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం మూడు నెలల్లో అనర్హత పిటిషన్‌పై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనే నిబంధన ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని పేరా నంబర్ 30, 33 ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ నెల 27వ తేదీన హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత అంశంపై విచారణ ఉంది. న్యాయ ప్రకారం వెంటనే హైకోర్టు నిర్ణయం తీసుకుని, దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లే నిర్ణయం బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. అలాగే పార్టీ మారిన మరికొందరు ఎమ్మెల్యేలపైన సుప్రీంకోర్టుకు వెళ్లాలని పార్టీ నిర్ణయించింది.