»Massive Transfers Of Ias In The State Amrapali Ghmc Commissioner
IAS Transfers: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి
తెలంగాణ వ్యాప్తంగా భారీగా ఐఏఎస్‌లు బదిలీలు జరిగాయి. ఒకే సారి 44 మందిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగా ఐఏఎస్ ఆమ్రపాలికి జీహెచ్ఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
Massive transfers of IAS in the state.. Amrapali GHMC commissioner
IAS Transfers: తెలంగాణ వ్యాప్తంగా భారీగా ఐఏఎస్‌ల బదిలీలు అయ్యాయి. ఒకేసారి 44 మందిని ప్రభుత్వం వివిధ శాఖలకు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సుల్తానియాను నియమించింది. దీనితో పాటు ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చింది. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్యకార్యదర్శిగా సుల్తానియా కొనసాగనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈరోజు జీవో విడుదల చేశారు. చేనేత, హస్తకళల ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్యను ట్రాన్స్ఫర్ చేశారు. హ్యాండ్లూమ్స్, టీజీసీవో హ్యాండ్‌క్రాఫ్ట్స్ ఎండీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. అలాగే జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఈ స్థానంలో ఉన్న రొనాల్డ్ రోస్‌ను విద్యుత్ శాఖ కమిషనర్‌గా ట్రాన్స్ఫర్ చేశారు. జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీగా అదనపు బాధ్యతలు జతచేశారు.
పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్
కార్మిక, ఉపాధి శిక్షణశాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్
యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడలశాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్
చేనేత, హస్తకళల ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్య
హ్యాండ్లూమ్స్, టీజీసీవో హ్యాండ్‌క్రాఫ్ట్స్ ఎండీగా శైలజకు అదనపు బాధ్యతలు
అటవీ, పర్యావరణశాఖల ముఖ్యకార్యదర్శిగా అహ్మద్ నదీమ్
హెచ్ఎండీఏ కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్
టీపీటీఆర్ఐ డీజీగా అహ్మద్ నదీమ్‌కు అదనపు బాధ్యతలు
వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ ముఖ్యకార్యదర్శిగా రిజ్వి
జీఏడీ ముఖ్యకార్యదర్శిగా సుదర్శన్‌రెడ్డి
హౌసింగ్, రిజిస్ట్రేషన్లు, స్టాంపులశాఖ ముఖ్యకార్యదర్శిగా జ్యోతి బుద్ధప్రసాద్
స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా సోనీ బాలాదేవి
రవాణాశాఖ కమిషనర్‌గా కే.ఇలంబరితి
జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు
జీహెచ్ఎంసీ, విజిలెన్స్, విపత్తు నిర్వహణ కమిషనర్‌గా రంగనాథ్
జలమండలి ఎండీగా కే.అశోక్‌రెడ్డి
జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా స్నేహా శబరి
జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా అనురాగ్ జయంతి
జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా హెచ్‌కే. పాటిల్
జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ కమిషనర్‌గా అపూర్వ్ చౌహన్
జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా ఉపేందర్‌రెడ్డి
కళాశాల, సాంకేతిక విద్యాశాఖల కమిషనర్‌గా శ్రీదేవసేన
సెర్ప్ సీఈవోగా డీ.దివ్య
ప్రజావాణి నోడల్ అధికారిగా దివ్యకు అదనపు బాధ్యతలు
రోడ్లు, భవనాలశాఖ ప్రత్యేక కార్యదర్శిగా హరిచందన
పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా ఎన్.ప్రకాశ్‌రెడ్డి
ఎస్సీ గురుకులాల కార్యదర్శిగా అలగ్‌వర్షిణి
గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శిగా వీపీ గౌతమ్
పురపాలక శాఖ డైరెక్టర్‌గా గౌతమ్‌కు అదనపు బాధ్యతలు
ఉపాధి, శిక్షణ శాఖల డైరెక్టర్‌గా కృష్ణా ఆదిత్యకు అదనపు బాధ్యతలు
ఐటీ ఉపకార్యదర్శిగా భవేష్ మిశ్రా
కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శిగా జీ.రవి
గ్రామీణాభివృద్ధి సీఈవోగా కే.నిఖిల
ఉద్యానవన డైరెక్టర్‌గా యాస్మిన్ బాషా
ఆయిల్‌ఫెడ్ ఎండీగా యాస్మిన్ బాషాకు అదనపు బాధ్యతలు
ప్రొటోకాల్ డైరెక్టర్‌గా ఎస్.వెంకట్రావు
వ్యవసాయ,సహకార సంయుక్త కార్యదర్శిగా జీ.ఉదయ్‌కుమార్
పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌గా గోపికి అదనపు బాధ్యతలు
ఫిషరీస్ డైరెక్టర్‌గా ప్రియాంక
టూరిజం డైరెక్టర్‌గా ఐలా త్రిపాఠి
రాష్ట్ర ఆర్థికసంఘం ఎండీగా కాత్యాయని దేవి
పాఠశాల విద్యా డైరెక్టర్‌గా నర్సింహారెడ్డి
సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా నర్సింహారెడ్డికి అదనపు బాధ్యతలు
వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీగా సహదేవరావు
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా అభిషేక్ అగస్త్య
భద్రాచలం ఐటీడీఏ పీవోగా రాహుల్
మూసీ అభివృద్ధి జేఎండీగా గౌతమి
టీజీ ఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నిఖిల్ చక్రవర్తి