Gold Rates Today : స్వల్పంగా తగ్గిన వెండి, బంగారం ధరలు!
బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజూ తగ్గుముఖం పట్టాయి. అయితే సోమవారం చాలా నామమాత్రంగా మాత్రవే వీటి రేట్లు తగ్గాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇక్కడ చదివేయండి.
Gold and Silver Rates Today : బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టాలనుకునే వారు వీటి ధరల్ని రోజూ గమనిస్తూ ఉండాల్సిందే. ఇవాల్టి ధరల్ని తెలుసుకునేందుకు ఇక్కడ చదివేయండి. బంగారం ధర వరుసగా రెండో రోజూ తగ్గుముఖం పట్టింది. సోమవారం దీని ధర స్వల్పంగా రూ.54 మాత్రమే తగ్గుముఖం పట్టింది. దీంతో దేశీయ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ.73,930కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తదితర చోట్ల కూడా పది గ్రాముల పసిడి ధరలు(Gold Rates) దాదాపుగా ఇలాగే కొనసాగుతున్నాయి.
దేశీయ మార్కెట్లలో వెండి ధర(Silver Rate)లు సైతం సోమవారం నామమాత్రంగా తగ్గాయి. రూ.159 మాత్రం తగ్గాయి. దీంతో నేడు కిలో వెండి ధర రూ.91,280గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని దుకాణాల్లోనూ దాదాపుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ కూడా నేటి మార్కెట్ ప్రారంభ సమయానికి స్వల్పంగా తగ్గుముఖం పట్టడం గమనార్హం.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, సిల్వర్ ధరలు సైతం నేడు నామమాత్రంగా తగ్గాయి. సోమవారం ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 2325 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి 29.55 డాలర్లుగా ఉంది.