Shilpa Shetty : బాలీవుడ్లో స్టార్ జంటగా పేరున్న శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రా దంపతులు ఎప్పుడూ ఏదో ఒక కేసుల్లో పడుతూనే ఉంటారు. ఇప్పటికే ఈ జంటపై మనీలాండరింగ్, బిట్ కాయిన్ ఫ్రాడ్, పోర్న్ గ్రఫీ కేసుల్లాంటివి నడుస్తూనే ఉన్నాయి. వీటికి తోడు ఇప్పుడు వీరిపై చీటింగ్ కేసు(Cheating Case) నమోదు చేయమంటూ స్వయంగా ముంబయి కోర్టు(Mumbai Court ) పోలీసులను ఆదేశించింది.
శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలు(Shilpa Shetty, Raj Kundra) బోగస్ బంగారం స్కీమ్ పేరుతో తనని మోసం చేశారని ఓ వ్యాపార వేత్త కోర్టును ఆశ్రయించారు. వారికి సత్యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఉంది. దాని ద్వారా తాను మోసపోయానని ఆ వ్యాపారి కోర్టుకు తెలిపాడు. దీంతో ఆ ఫిర్యాదు మేరకు ముంబయి అదనపు సెషన్స్ కోర్టు జడ్జి ఎన్.పి మెహతా పోలీసులకు పై విధంగా ఆదేశాలు జారీ చేశారు. వారిపై చీటింగ్కేసు పెట్టాల్సిందిగా తెలిపారు. అందుకు సరిపడా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని జడ్జి తెలిపారు. కేసు నమోదు చేస్తే ఈ విషయమై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని అన్నారు.