»Bjd Leader Vk Pandian Says I Decide To Withdraw Myself From Active Politics
Odisha : నవీన్ పట్నాయక్ సన్నిహితుడైన వీకే పాండియన్ రాజకీయాలకు గుడ్ బై
ఒడిశా నుంచి ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. బీజేడీ నేత, మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సన్నిహితుడు వీకే పాండియన్ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.
Odisha : ఒడిశా నుంచి ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. బీజేడీ నేత, మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సన్నిహితుడు వీకే పాండియన్ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రియాశీల రాజకీయాలకు దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఈ ప్రయాణంలో ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరారు.
ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బిజూ జనతాదళ్ (బీజేడీ) ఘోర పరాజయం పాలైన తర్వాత వీకే పాండియన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘రాజకీయాల్లో చేరాలన్న నా ఉద్దేశం కేవలం నవీన్‌బాబుకు సహాయం చేయడమేనని, ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ప్రచారంలో బీజేడీ ఓటమికి నేనేమైనా పాత్ర పోషించి ఉంటే చింతిస్తున్నాను. ఇందుకు నేను పార్టీ కార్యకర్తలందరితో సహా బిజూ కుటుంబానికి క్షమాపణలు చెబుతున్నాను. ’అని మాజీ బ్యూరోక్రాట్ పాండియన్ వీడియో సందేశంలో తెలిపారు.
వీకే పాండియన్ నవీన్ పట్నాయక్‌కు వారసుడిగా కనిపించాడు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో బీజేడీ ఘోర పరాజయం పాలైన తర్వాత పట్నాయక్ పై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. అయితే పాండియన్ తన వారసుడు కాదని, ఆయన వారసుడు ఎవరో ఒడిశా ప్రజలే నిర్ణయిస్తారని పట్నాయక్ శనివారం పునరుద్ఘాటించారు. పార్టీ ఓటమికి పాండియన్‌పై విమర్శలు చేయడం దురదృష్టకరమని, పాండియన్ అద్భుతంగా పనిచేశారని కూడా పట్నాయక్ అన్నారు. అతను (పాండియన్) నీతి, నిజాయితీ గల వ్యక్తి అన్నారు. పార్టీలో చేరి ఎలాంటి పదవులు చేపట్టలేదు. ఆయన ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు.