PM Modi: మోడీ ప్రమాణ స్వీకారానికి మల్లికార్జున ఖర్గే
మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దం అయింది. దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులు, సీఎంలు కీలక నేతలకు ఆహ్వానం అందింది. జాతీయ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్కు సైతం ఆహ్వానం అందింది. మరీ కార్యక్రమానికి మల్లికార్జున ఖర్గే వెళ్లనున్నట్లు తెలుస్తుంది.
PM Modi: భారత దేశానికి వరుసగా మూడో ప్రధాన మంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఎన్డీయే కూటమి బలపరిచిన ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. మోడీ 3.0 ప్రభుత్వం ఈరోజు సాయంత్రం ప్రమాణస్వీకారంతో కొలువుతీరనున్నారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ అధ్యక్షకులకు, ముఖ్యమంత్రులకు, ప్రధాన నేతలకు బీజేపీ అధిష్టానం ఆహ్వానాలు అందించింది. అంతే కాకుండా ఇండియా పొరుగుదేశాల నేతలు కూడా హాజరవుతున్నారు. భారత దేశంలో ప్రధానప్రతిపక్షనేత పార్టీగా ఉన్న కాంగ్రెస్ తరఫున ఎవరు పాల్గొంటున్నారు అనే ఉత్కంఠ అందరిలో ఉంది.
ఆహ్వానం అందిన అనంతరం ఇండియా కూటమి కీలక నేతలతో కాంగ్రెస్ పార్టీ ముఖ్య సమావేశం నిర్వహించింది. ఈ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నట్లు కూటమి సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇండియా కూటమిలో భాగస్వామ్యం అయిన తృణమూల్ కాంగ్రెస్ ఈ కార్యక్రమానికి హాజరు కావడంలేదని తెలుస్తోంది.