AP : ఏపీలో టీచర్ల బదిలీలు రద్దు.. గత ప్రభుత్వ ఉత్తర్వులు నిలిపివేత
ఎన్నికల కోడ్ రావడానికి కొన్ని రోజుల ముందే ఏపీలో 1800 మంది టీచర్లకు బదిలీలను నిర్వహించారు. అయితే వాటిని ఇప్పుడు రద్దు చేస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి.
AP Teacher Transfers: ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో కొన్ని పాత నిర్ణయాలపై దృష్టి పెట్టింది. ఎన్నికల కోడ్ వెలువడటానికి కొద్ది రోజుల ముందు వైసీపీ ప్రభుత్వం 1800 మంది ఉపాధ్యాయులను(teachers) బదిలీ చేసింది. ఇందు కోసం డబ్బులు సైతం చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ బదిలీలను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
సాధారణంగా జరిగే ఉపాధ్యాయుల బదిలీలు( teacher transfers) చేపట్టకుండా తమకు కావాల్సిన వారికి మాత్రమే ప్రత్యేకంగా బదిలీలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. వీటి వెనుక లక్షల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. దీనిలో సీఎంఓ కార్యాలయం అధికారులు, మంత్రి బొత్స సత్యనారాయణ కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అనుకున్న వారిని బదిలీలు చేసింది. దీంతో అప్పుడు జారీ చేసిన బదిలీల ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు ఇప్పుడు విద్యా శాఖ ముఖ్య కమిషనర్ ఆదేశాలను జారీ చేశారు.