»Uttarakhand 9 Trekkers Dead After Losing Way In High Altitude Bad Weather
trekkers: హిమాలయాల్లోకి ట్రెక్కింగ్‌కి వెళ్లి బెంగళూరుకు చెందిన 9మంది మృతి
హిమాలయాల్లోకి ట్రెక్కింగ్‌కి వెళ్లిన ఓ బెంగళూరు బృందంలో తొమ్మిది మంది దురదృష్టవశాత్తూ మృత్యు వాత పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bengaluru trekkers : బెంగళూరు నుంచి 19 మంది సభ్యుల బృందం హిమాలయాల్లోకి ట్రెక్కింగ్‌కి( Trekking) వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా వాతావరణంలో సడన్‌గా మార్పు సంభవించింది. దీంతో బేస్ క్యాంప్‌కి రావడానికి వారికి ప్రతికూలమైన వాతావరణం ఏర్పడింది. ఓ హిమాలయ పర్వతంపై చిక్కుకున్న ఆ బృందంలో తొమ్మిది మంది చనిపోయారు. మిగిలిన 13 మందిని రెస్క్యూ బృందాలు సురక్షితంగా కిందికి తీసుకుని వచ్చాయి.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మే 27న కర్నాటకకు చెందిన 19 మందిని ముగ్గురు స్థానిక గైడ్స్ హిమాలయాల్లోకి(Himalayas) ట్రెక్కింగ్‌కి తీసుకెళ్లారు. ఉత్తరాఖండ్‌లోని అలా ఉత్తర కాశి నుంచి మొత్తం 22 మంది 35 కిలోమీటర్ల పొడవైన ట్రెక్కింగ్ చేసేందుకు హిమాలయాల్లోకి వెళ్లారు. హిమాలయన్ వ్యూ ట్రెక్కింగ్ ఏజన్సీ అనే సంస్థ వారిని ఇందు కోసం తీసుకుని వెళ్లింది.
వారు పర్వతం పై వరకు వెళ్లి తిరిగి బేస్ క్యాంప్‌కు రావాల్సిన సమయంలో అక్కడ వాతావరణం ఒక్కసారిగా తారుమారైపోయింది. దీంతో ఆ ప్రతికూల వాతావరణంలో వారు అక్కడే చిక్కుకుపోయారు. వారిలో తొమ్మిది మంది చనిపోగా 13 మందిని రెస్క్యూ టీం రక్షించింది. ఈ విషయమై కర్నాటక సీఎం సిద్ధ రామయ్య సైతం స్పందించారు. తొమ్మిది మంది మృతి చెందడం బాధాకరమన్నారు. సహాయక చర్యలను సమీక్షించాలని రెవెన్యూ మంత్రి కృష్ణ బైరె గౌడను ఆదేశించారు.