Tollywood producer S Radhakrishna Mother Nagendramma Passed Away
S Radhakrishna: తెలుగుపరిశ్రమలో ప్రముఖ నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాతృవియోగం కలిగింది. ఆయన్ను అందరూ చినబాబు అని పిలుస్తారు. రాధాకృష్ణ తల్లి సూర్యదేవర నాగేంద్రమ్మ (90) ఆనారోగ్యంతో కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు హృదయ సంబంధిత వ్యాధితో తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన తల్లి మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక నాగేంద్రమ్మ అంత్యక్రియలు శుక్రవారం హైదరాబాదు ఫిలింనగర్ విద్యుత్ శ్మశాన వాటికలో జపరనున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. నాగేంద్రమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు అందులో రెండోవాడు నిర్మాత రాధాకృష్ణ.