Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 May 30th)..దైవదర్శనం చేసుకుంటారు.
ఈ రోజు(2024 April 30th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
శుభకార్యలు సులభంగా నెరవేరుతాయి. సన్నిహితులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాలు లాభాన్ని చేకూరుస్తాయి. శ్రమకు తగిన ఫలితం ఉంది. సమాజంలో కీర్తిప్రతిష్టలు లభిస్తాయి. సుఖాన్ని పొందుతారు.
వృషభం
కుటుంబ పరిస్థితులు అనుకూలిస్తాయి. సహనం వహించడం మేలు. దగ్గరివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేస్తారు. అనారోగ్య బాధలు ఉన్నాయి.
మిథునం
కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలత్వం ఏర్పడుతుంది. పిల్లలపట్ల జాగ్రత్త వహిస్తారు. మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితి అలాగే ఉంటుంది.
కర్కాటకం
ఆస్తులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ధనలాభం పొందుతారు. సన్నిహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు.
సింహం
ఇతరులను నమ్మి మోసపోకూడదు. సమాజంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఉన్నాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదరులతో జాగ్రత్తగా ఉండాలి.
కన్య
మనస్సు చంచలంగా ఉంటుంది. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. అకాల భోజనంతో అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంది.
తుల
వృథా ప్రయాణాలు ఎక్కువ. వ్యాపార రంగంలో మెండుగా లాభాలు ఉంటాయి. రుణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతనకార్యాలకు శ్రీకారం చుడతారు.
వృశ్చికం
విదేశయాన ప్రయత్నాలు నెరవేరుతాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. మెలకువగా ఉండటం మంచిది. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. రుణలాభం ఉంది. ఎలర్జీ బాధ అధికం అవుతుంది.
ధనుస్సు
కుటుంబంతో సరదాగా గడుపుతారు. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఉన్నాయి. వృథా ప్రయాణాలతో అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండాలి. అందరితో స్నేహంగా ఉండాలి.
మకరం
మొదలు పెట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేసుకోగలుగుతారు. సన్నిహితులతో మర్యాదలు పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి.
కుంభం
ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. కళలందు ఆసక్తి ఉంటుంది.
మీనం
కుటుంబ పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. కొత్త పనులు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ఆత్మీయుల సహాయ సహకారాలకోసం ముందుకు కదలాలి.