Sathyaraj : దక్షిణాదిలో నటుడు సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అద్భుతమైన నటనతో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఎన్నో సినిమాల్లో తన నటనా కౌశలాన్ని ప్రదర్శించాడు. ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ సినిమా ఫ్రాంచైజీలో కట్టప్ప పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. సత్యరాజ్ కెరీర్లో ఇది చాలా ముఖ్యమైన పాత్ర. అదే సమయంలో ఇప్పుడు సత్యరాజ్ మరో ముఖ్య పాత్రలో నటించబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.
సత్యరాజ్ తదుపరి సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. అతను తదుపరి ఓ బయోపిక్‌లో కనిపిస్తాడు. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బయోపిక్‌లో సత్యరాజ్ కీలక పాత్రను పోషించవచ్చని వార్తలు వచ్చాయి. అయితే ఈ పుకార్లు ఇంటర్నెట్లో వేగంగా వ్యాపించాయి. ఈ వార్తలు ఇంకా ధృవీకరించబడలేదు. ఇదే జరిగితే ప్రధాని మోడీ పాత్రలో సత్యరాజ్‌ని చూడడం ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటుంది.
ప్రధాని నరేంద్ర మోడీ జీవితంపై రూపొందుతున్న తొలి సినిమా ఇది కాదు. ఇంతకు ముందు కూడా చాలా మంది స్టార్స్ ప్రధాని మోడీ పాత్రను పోషించారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ 2019లో ‘పీఎం నరేంద్ర మోడీ’లో ప్రధాని మోడీ పాత్రను పోషించారు. దీనితో పాటు, మహేష్ ఠాకూర్, ఇతర తారలు తెరపై పిఎం మోడీగా మారారు. పీఎం మోడీపాత్రలో సత్యరాజ్ నటించబోతున్న సినిమా షూటింగ్ ఈ ఏడాది ప్రారంభం కానుందని టాక్. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర సమాచారాన్ని ప్రస్తుతం గోప్యంగా ఉంచారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక బృందం గురించి ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. ‘బాహుబలి’లో కట్టప్ప పాత్రను పోషించిన తర్వాత సత్యరాజ్ తన తదుపరి సౌత్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.