Baba Vanga: బల్గేరియన్ ప్రవక్త బాబా వెంగా అంచనాలను ప్రపంచం మొత్తం నమ్ముతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే బాబా వంగా 2024లో చాలా అంచానాలు వేశారు. ఇవి చాలా భయానకంగా ఉన్నాయి. ప్రముఖ ప్రవక్తలలో ఒకరైన బాబా వంగా చెప్పిన అనేక అంచనాలు నిజమయ్యాయి. బాబా వెంగాను బాల్కన్ ప్రాంతంలో నోస్ట్రాడమస్ అంటారు. తన మరణానికి ముందు.. బాబా వెంగా ప్రపంచం అంతం, యుద్ధం, విపత్తుతో సహా అనేక అంచనాలు వేశారు. ఆమె 5079 సంవత్సరం వరకు ఊహించారు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం, అమెరికాలో తీవ్రవాద సంస్థ అల్ ఖైదా 9/11 దాడులతో సహా తన అంచనాలు చాలా నిజమయ్యాయి. బల్గేరియాకు చెందిన అంధురాలైన బాబా వెంగా కేవలం 12 ఏళ్ల వయసులోనే కంటి చూపు కోల్పోయింది. బాబా వెంగా 1996లో 85 ఏళ్ల వయసులో మరణించారు.
ఆమె చెప్పిన విషయాలు దాదాపు 85 శాతం నిజాలే అని అంటున్నారు. తను ఘోరమైన తుఫానులో తన కంటి చూపును కోల్పోయిన తర్వాత తన ఈ పవర్స్ పొందారు. 2024 సంవత్సరంలో ఒక దేశస్థుడి చేతిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై హత్యాయత్నం జరుగుతుందని బాబా అంచనా వేశారు. ఈఏడాది తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేశారు. దీంతో భూమిపై పెద్ద మార్పు ఉంటుంది. భూమి చుట్టూ భయంకరమైన వినాశనం సంభవించవచ్చు.
సైబర్ దాడులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. హ్యాకర్లు 2024లో పవర్ గ్రిడ్లు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను టార్గెట్ చేయవచ్చు. ఇది దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుంది. గత నెలల్లో, చాలా పెద్ద కంపెనీలు సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనలకు సంబంధించిన అన్ని కేసులను బహిర్గతం చేశాయి. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే పెద్ద ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని బాబా వెంగా అంచనా వేశారు. అందుకు అనేక కారణాలను ఎత్తిచూపారు. వీటిలో పెరుగుతున్న రుణ స్థాయిలు, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక శక్తి పశ్చిమం నుండి తూర్పుకు మారడం వంటివి ఉన్నాయి.
2024 సంవత్సరంలో వైద్య రంగంలో పురోగతులు ఆశించబడతాయి. ఇందులో అల్జీమర్స్ వంటి వ్యాధులకు కొత్త చికిత్సలు.. 2024 నాటికి క్యాన్సర్‌ను నయం చేసే అవకాశం ఉంది. రష్యా శాస్త్రవేత్తలు క్యాన్సర్ వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు దగ్గరగా ఉన్నారని అధ్యక్షుడు పుతిన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఒక పెద్ద దేశం బయోలాజికల్ ఆయుధాలను పరీక్షిస్తుందని లేదా దాడి చేస్తుందని బాబా వెంగా చెప్పారు. ఇది కాకుండా, ఆమె యూరప్‌లో ఉగ్రవాద దాడి భయాన్ని కూడా వ్యక్తం చేశాడు. బాబా వెంగా ప్రపంచం అంతం గురించి ఊహించారు. ఆమె 5079 వరకు ప్రపంచం అంతమవుతుందని ఊహించారు.