Subbamma Jasti : ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో జాస్తి సుబ్బమ్మ స్థానం దక్కించుకున్నారు. మన దేశానికి సంబంధించి అత్యంత వృద్ధ బిలియనీర్‌గా ఫోర్బ్స్ ఆమెను పేర్కొంది. ఆమె ఏప్రిల్ నెలలో ఫోర్బ్స్ జాబితాలో(Forbes list) స్థానం దక్కించుకున్నారు. ఇప్పుడు ఆమె నికర సంపద 1.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇంత పెద్ద వయసులో ఆమె ఈ స్థానం దక్కించుకోవడం వెనక కారణాలేంటో తెలుసుకుందాం రండి.
జాస్తి సుబ్బమ్మ సువెన్ ఫార్మాస్యూటికల్స్ సహ వ్యవస్థాపకుడు వెంకటేశ్వులు తల్లి. ఆమె ప్రస్తుతం హైదాబాద్‌లో నివసిస్తున్నారు. ఆమె కొడుకు వెంకటేశ్వరులు జాస్తి 1970ల్లోనే అమెరికా వెళ్లారు. అక్కడ న్యూజెర్సీ, న్యూయార్క్‌ల్లో ఆరు కమ్యునిటీ ఫార్మసీ చైన్లను నడిపేవారు. 2022లో సువెన్ ఫార్మా స్యూటికల్స్ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్‌కు భారీ వాటాని విక్రయించింది. దీంతో భర్త చనిపోవడంతో సుబ్బమ్మ జాస్తికి(Subbamma Jasti) ఆ పెద్ద వాటా ఆస్తి దక్కింది.
భర్త వారసత్వంగా వచ్చిన ఆస్తిని పొందడంతో ఆమె ఉన్నట్లుండి ఫోర్బ్స్(Forbes) బిలియనీర్ల జాబితాలో చోటు దక్కిచుకున్నారు. భారతదేశ వృద్ధ మహిళా బిలియనీర్‌గా( oldest woman billionaire) రికార్డులకూ ఎక్కారు. ఇప్పుడు ఆమె ప్రపంచ ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో 2,653వ స్థానంలో నిలిచారు. మన భారత దేశంలో మహిళా బిలియనీర్లలో సావిత్రీ జిందాల్ 34.9 బిలియన్ డాలర్ల నికర సంపదతో అత్యంత సంపన్న మహిళగా మొదటి స్థానంలో ఉన్నారు.