బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కి ఫోర్బ్స్ జాబితాలో చోటుదక్కించుకుంది. ఇప్పటి వరకు సింధు… తన ఆటతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తన ఆటతో… దేశానికి ఎంతో గౌరవ ప్రతిష్టలను తీసుకువచ్చింది. కాగా…. మంచి ఆట తీరును ప్రదర్శిస్తూ.. ప్రశంసలను దక్కించుకుంటున్న సింధు సంపాదనలో దూసుకెళుతోందని ఫోర్బ్స్-2022 జాబితా చూస్తే అర్థమవుతుంది. ప్రతి యేటా మాదిరిగానే ఫోర్బ్స్ ఈ ఏడాది అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పీవీ సింధు 12వ స్థానాన్ని దక్కించుకొని సత్తా చాటింది.
మహిళల అథ్లెట్లలో అత్యధికంగా సంపాదిస్తున్న 25 క్రీడాకారిణిల జాబితాను ఫోర్బ్స్ రిలీజ్ చేసింది. ఆ జాబితాలో షట్లర్ పీవీ సింధు 12వ స్థానంలో ఉన్నారు. జపాన్‌కు చెందిన టెన్నిస్ స్టార్ ప్లేయర్ నవోమీ ఒసాకా తొలి స్థానంలో ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్, కామన్వెల్త్గేమ్స్ సింగ్సిల్‌లో గోల్డ్, డబుల్స్‌లో సిల్వర్ గెలిచిన సింధు.. ఈ ఏడాది ఏడు మిలియన్ల డాలర్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. అయితే ఈ జాబితాలో ఎక్కువ శాతం మంది టెన్నిస్ ప్లేయర్లే ఉండటం గమనార్హం.