ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’ అప్డేట్ గురించి నానా హంగామా చేస్తున్నారు అభిమానులు. శ్రీరాముడిగా కనీసం ప్రభాస్ ఫస్ట్ లుక్ అయినా రిలీజ్ చేయాలని పట్టుబడుతున్నారు. కానీ దర్శకుడు ఓం రౌత్ మాత్రం స్పందించడం లేదు. ఈ మధ్యలో ప్రభాస్ బర్త్ డేకు భారీ ట్రీట్ ఉంటుందని చెప్పినా.. దానికి ఇంకా చాలా సమయం ఉంది. అయితే ఉన్నట్టుండి దసరా సందర్భంగా.. అక్టోబర్ 3న ఆదిపురుష్ టీజర్ రాబోతోందనే న్యూస్ వైరల్‌గా మారింది. ఈ సారి ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో.. ప్రభాస్ చేతుల మీదుగా రావణ దహనం జరగబోతున్నట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో గ్రాండ్‌గా ఆదిపురుష్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారని తెలిసింది.
దాంతో ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఆదిపురుష్. అయితే ఇప్పుడు మళ్లీ వ్యవహరం మొదటికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఆదిపురుష్ టీజర్ పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో దసరాకి కూడా ‘ఆదిపురుష్’ టీజర్ కష్టమే అనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే దానికి కూడా ఓ కారణం ఉందంటున్నారు. పెదనాన్న కృష్ణంరాజు మరణంతో.. ప్రభాస్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆదిపురుష్ టీజర్‌కు సంబంధించిన పనుల కోసం ప్రభాస్ ముంబై వెళ్లే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. అందుకే హోల్డ్‌లో పెట్టారని టాక్. అయితే ఇలాంటి వార్తల్లో అసలు నిజముందా అనేది కాస్త డౌటే. కానీ ఒకవేళ ఆదిపురుష్ టీజర్ రాకపోతే మాత్రం.. ఈ సారి ఫ్యాన్స్ మరింత డిసప్పాయింట్ అవడం ఖాయమంటున్నారు. అంతేకాదు వాళ్ల కోపాన్ని తట్టుకోవడం కూడా కష్టమే.