»Janhvi Kapoors Wedding In Tirupati This Is The Clarity
Janhvi Kapoor: తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి.. ఇదే క్లారిటీ?
ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కెరీర్ పీక్స్‌లో ఉంది. త్వరలోనే తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇలాంటి సమయంలో పెళ్లి అనే న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది. దీంతో.. తన పెళ్లి వార్తలపై స్పందించింది జాన్వీ.
Janhvi Kapoor's wedding in Tirupati.. This is the clarity?
Janhvi Kapoor: హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ పెళ్లి చేసుకుంటోందా? అంటే, ఔననే పుకార్లు ఓ రేంజ్లో షికార్లు చేస్తున్నాయి. గత కొంత కాలంగా శిఖర్ పహారియాతో జాన్వీ కపూర్ ప్రేమలో ఉందనే వార్తలు వైరల్ అవుతునే ఉన్నాయి. జాన్వీ, శిఖర్ కలిసి చాలాసార్లు కనిపించారు. తిరుమలకు కూడా ఒకటి రెండు సార్లు కలిసే వచ్చారు. దీంతో.. తిరుపతిలో జాన్వీ, శిఖర్ పెళ్లి చేసుకోనున్నారనే రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. అందుకు సంబంధించిన ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ జాన్వీ కంట కూడా పడింది. దీంతో.. జాన్వీ తన పెళ్లి వార్తల పై స్పందించింది. తిరుపతిలో పెళ్లి అనే పోస్ట్‌కు రియాక్ట్ అవుతూ.. ‘కుచ్ బీ’ అంటూ కామెంట్ చేసింది. ఏదైనా రాసేస్తారా.. అనే అర్థంతో ఈ కామెంట్ పెట్టింది. దీంతో.. పెళ్లి వార్తల్లో వాస్తవం లేదని జాన్వీ క్లారిటీ ఇచ్చేసింది.
అయితే.. జాన్వీ కపూర్, శిఖర్ పహారియా డేటింగ్లో ఉన్నారని కొంతకాలంగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. కానీ ఈ విషయం పై ఇద్దరూ సైలెంట్‌గా ఉంటున్నారు. ఆ మధ్య ఈ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారనే టాక్ వచ్చినప్పటికీ.. మళ్లీ కొన్నాళ్లకే కలిసిపోయినట్టుగా చెబుతున్నారు. కానీ ఓపెన్ అవడం లేదు. ఇకపోతే.. త్వరలోనే తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతోంది జాన్వీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఏదేమైనా.. జాన్వీ మాత్రం తన పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చేసింది.