MLC Kavitha: కవితకు షాక్.. బెయిల్ నిరాకరించిన కోర్టు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులె ఆరోపణలు ఎదుర్కొంటే తిహార్ జైల్లో ఉన్న కవితకు ఈ రోజు మళ్లీ షాక్ తగిలింది. బెయిల్ కోసం దాఖలు చేసిన రెండు పిటిషన్లను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోరట్టు కొట్టేసింది.
MLC Kavitha: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోసం దాఖలు చేసిన రెండు పిటిషన్లను తాజాగా ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో కవితకు బెయిల్ నిరాకరించింది. కవిత తరఫు న్యాయవాది రెండు పిటిషన్లు వేయగా వాటికి కౌంటర్ పిటిషన్ వేశారు ఈడీ తరఫు న్యాయవాది. దాంతో ఈ రోజు ఇరువైపుల వాదనలు విన్న ఢిల్లీ కోర్టు ఈ రోజుక వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం విచారణ అనంతరం తీర్పు వెలువరించింది. కవితకు బెయిల్ ఇవ్వడం కుదరని ఆ తీర్పులో పేర్కొంది.
కవిత తరఫు న్యాయవాది ఎలాంటి ఆధారాలు లేకున్నా తన క్లయింట్‌ను అక్రమంగా అరెస్టు చేశారని వాదించారు. మహిళ అనే కోణంలో కోర్టుకు సానుబూతి కలిగేలా ఆయన వాదనలు వినిపించానా రౌస్ ఎవెన్యూ కోర్టు వాటిని తోసిపుచ్చింది. ఢిల్లి లిక్కర్ పాలసీకి సంబంధించి, మనీలాండరింగ్ ఆరోపణలపై సీబీఐ, ఈడీ దాఖలు చేసని కేసులతో కవిత తీహార్ జైలుకు తరలించారు. ఇక కేజ్రీవాల్ సైతం అదే జైలులో ఉన్న విషయం తెలిసిందే.