»Palestinian Flag At Harvard University 900 People Arrested Across America
Harvard University: హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా.. 900 మంది అరెస్ట్
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం ఆపాలంటూ.. గాజాపై దాడులను వ్యతిరేకిస్తూ అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆందోళనలు మొదలయ్యాయి. యూనివర్సిటీలో ఉన్న జాన్ హార్వర్డ్ విగ్రహంపై పాలస్తీనా జెండాను ఎగరవేయడంతో.. నిరసన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Palestinian flag at Harvard University.. 900 people arrested across America
Harvard University: పాలస్తీనాపై దాడులు ఆపాలంటూ.. ఇజ్రాయెల్‌కు అమెరికా సాయం చేయడం మానుకోవాలంటూ ఆగ్రరాజ్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. పలు యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రముఖ విశ్వవిద్యాలయం హార్వర్డ్‌లో భారతీయ విద్యార్థులతో సహా ఇతర దేశాల విద్యార్థులు నిరసనలు చేస్తూ… ప్రఖ్యాత జాన్ హార్వర్డ్ విగ్రహంపై పాలస్తీనా జెండాను ఎగరవేశారు. మాములుగా అయితే ఆ విగ్రహంపై అమెరికా జెండా ఎగురుతుంది. ఏదైన ప్రత్యేక పరిస్థితుల్లో, ఇతర దేశాల ప్రతినిధులు వచ్చినప్పుడు వారిని గౌరవించడానికి ఆ విగ్రహంపై వారి దేశం జెండా ఎగరవేయడం పరిపాటి. అలాంటిది పాలస్థీనా జెండా ఎగరవేడంతో పాటు నిరసనలతో వర్సిటీలో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకుంది.
దీనిపై యూనివర్సిటీ ప్రతినిథి జోనాథన్ ఎల్ స్వెయిన్ తీవ్రంగా ఖండించారు. ఇలా చేయడం విశ్వవిద్యాలయ నిబంధనలకు వ్యతిరేకమని, కారకులపై క్రమశిక్షణ చర్యాలు తీసుకుంటామని తెలిపారు. తొలుత న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 18 న మొదలైన ఆందోళన ఇప్పుడు అన్ని యూనివర్సిటీలకు పాకింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన కారులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 900 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. శాంతియుత నిరసనలను తాము గౌరవిస్తామని జాతీయ భద్రత మండలి ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు. కానీ విద్వేషపూరిత నినాదాలను ఖండిస్తామని వెల్లడించారు. మరో వైపు ఈ నిరసన సెగ వైట్ హౌస్‌ను తాకింది. జో బైడన్ ఇచ్చిన విందుకు హాజరైన వేలాది జర్నలిస్టులు, రాజకీయ నాయకులకు నిరసనలు వినిపించారు. పాలస్తీనాకు స్వేచ్చ ఇవ్వండి అంటూ నినదించారు.