»A Woman Bitten By A Snake Takes It With Her To The Hospital
Warangal : కాటేసిన పాముతో ఆసుపత్రికి వచ్చిన మహిళ!
పొలం పనులు చేస్తున్న ఓ మహిళను ప్రమాద వశాత్తూ పాము కాటేసింది. దీంతో ఆ పామును చంపి దాన్ని పట్టుకుని ఆసుపత్రికి వచ్చిందా మహిళ. దీంతో అక్కడున్న వారంతా నివ్వెరపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Warangal : ఓ మహిళ ఉపాధి హామీ పనుల నిమిత్తం పొలానికి వెళ్లింది. అక్కడ ఆమెను ఓ పాము ప్రమాదవశాత్తూ కాటు వేసింది. దీంతో వెంటనే ఆ పామును(Snake) ఆమె వెంటనే చంపేసింది. దాన్ని వాటర్ బాటిల్లో వేసుకుని ఆసుపత్రికి తీసుకొచ్చింది. ఆసుపత్రి దగ్గర ఆ పామును చూసిన వారు అంతా నివ్వెరపోయి చూశారు. ఈ ఘటన తెలంగాణ, వరంగల్ జిల్లాలోని వెంకటాపురం మండలంలో చోటు చేసుకుంది. అక్కడి ముకునూరు పాలెంలో సోమవారం శాంతమ్మ అనే మహిళ ఉపాధి హామీ పనులకు వెళ్లింది. అక్కడ పని చేస్తున్న క్రమంలో ఆమెను పాము కాటు వేసింది.
ఆ పామును చంపి, వాటర్ బాటిల్లో బంధించిన ఆమె మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి(Hospital) హుటాహుటిన చేరుకుంది. తోటి కూలీలు కూడా ఆమె వెంట వచ్చారు. శాంతమ్మ వైద్యులకు పామును చూపించి ‘సార్ నన్నీ పాము కాటేసింది. దీన్ని చూసి వైద్యం చేయండి’ అంటూ అభ్యర్థించింది. దీంతో ఆ పామును చూసిన వైద్యులు తొలుత షాక్కు గురయ్యారు. తర్వాత అది విష పూరితమైన పాము అని గుర్తించారు. అందుకు తగినట్లుగా వైద్యం అందించారు. దీంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. శాంతమ్మ చేసిన ఈ పని చూసి ఆసుపత్రి సిబ్బంది తొలుత ఆశ్చర్య పోయినా, తర్వాత ప్రశంసించారు.