»Manchu Manoj Manchu Manojs Wife Gave Birth To A Baby Girl
Manchu Manoj: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన మంచు మనోజ్ భార్య
హీరో మంచు మనోజ్ తండ్రయ్యాడు. అతని భార్య భూమ మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మనోజ్ సోదరి మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Manchu Manoj: హీరో మంచు మనోజ్ తండ్రయ్యాడు. అతని భార్య భూమ మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మనోజ్ సోదరి మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పుడు వాళ్లు నలుగురు అయ్యారు. మా ఇంటి చిన్ని మహాలక్ష్మి అడుగుపెట్టింది. మనోజ్-మౌనికలకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. ధైరవ్ చెల్లి రాకతో అన్నయ్య అయిపోయాడు. ఎంతో ఆనందంగా ఆ పాపను భూమ్మీదకు ఆహ్వానించారు. ఆ పాపను మేం ప్రేమగా ఎంఎం పులి అని పిలుస్తున్నాం. ఆ శివుడి ఆశీస్సులు ఈ కుటుంబంపై ఉండాలని, వీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని ఆమె సోషల్ మీడియాలో తెలిపారు.
⭐️ ANNOUNCEMENT 📣
🌟 And just like that, they are four! Blessed by the Gods, a little Goddess has arrived! We are thrilled to announce that Manoj and Mounika have welcomed their much-awaited baby girl. Dhairav is overjoyed as her big brother. Cherishing her nickname, we all… pic.twitter.com/yfoabjWpwr
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) April 13, 2024
ఈ పోస్ట్‌ను మంచు మనోజ్ మళ్లీ రీపోస్ట్ చేశారు. దీంతో పలువులు నటులు, నెటిజన్లు స్పందిస్తూ అభినందనలు తెలుపుతున్నారు. మనోజ్, మౌనిక.. గతంలో వేర్వేరుగా పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ మనస్పర్థలు కారణంగా విడాకులు తీసుకున్నారు. తర్వాత వీళ్లు గతేడాది వివాహం చేసుకున్నారు. మంచు మనోజ్ కొన్నాళ్ల నుంచి నటనకు దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం వాట్ ది ఫిష్ అనే చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కనుంది.