»Domestic Air Passenger Traffic Grew 8 34 To 15 20 Cr In 2023
Air passengers : భారత్లో పెరుగుతున్న విమాన ప్రయాణికుల సంఖ్య
భారత్లో నానాటికీ విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. 2022-2023 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-2024లో ప్రయాణికుల రద్దీ 13 శాతం మేర పెరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇక్కడున్నాయి.
Independence Day Sale, Spicejet bumper offer for air travelers.. flight ticket for just Rs.1515
Air passengers traffic : దేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 2022-2023 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-2024లో ప్రయాణికుల రద్దీ 13 శాతం మేర పెరిగింది. ఈ విషయమై ఇక్రా తాజా నివేదికను వెల్లడించింది. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో 15.4 కోట్ల మంది భారత్లో విమాన ప్రయాణాలు చేసినట్లు తెలిపింది.
కరోనా సమయంలో విమాన రంగం చాలా నష్టాలను చవి చూసింది. అయితే ఆ తర్వాత అంతకు ముందు కంటే ఎక్కువగా జోరందుకుంది. 2019-20లో 14.2 కోట్ల మంది డొమస్టిక్ ఫ్లైట్లలో ఇక్కడ ప్రయాణించారు. అదే ఈ ఏడాది చూసుకున్నట్లైతే ఫిబ్రవరిలో 1.26 కోట్ల మంది, మార్చిలో 1.35 కోట్ల మంది ప్రయాణాలు చేసినట్లు అంచనా.
2023-2024 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు చూసుకున్నట్లయితే తొలి పదకొండు నెలల్లో అంతర్జాతీయ ప్రయాణికుల(passengers) రద్దీ 2.7 కోట్లుగా నమోదైంది. 2022-23లో ఇదే నెలలతో పోలిస్తే ఇది 25 శాతం అధికం. కరోనా ముందు కంటే 24 శాతం ఎక్కువ. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు అంతకంతకూ పెరుగుతుండటంతో విమాన సంస్థలు రికవర్ అవుతాయని ఇక్రా పేర్కొంది. 2024 -25లోనూ ఈ పెరుగుదల కొనసాగవచ్చని అంచనాలు వేస్తోంది.