»Mrunal Thakur In A Recent Interview Recalled Her Early Days In The Industry
Mrunal thakur : నేను పనికి రానన్న వాళ్లకి థ్యాంక్స్ చెప్పాలి : మృణాల్ ఠాకూర్
తాను కెరియర్ని ప్రారంభించిన తొలి నాళ్లలో తనను తిరస్కరించిన వాళ్లకు తప్పకుండా థ్యాంక్స్ చెప్పాలని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇంతకీ ఆమె ఎందుకలా అన్నారంటే..?
Mrunal thakur : కెరియర్ని ప్రారంభించిన తొలి రోజుల్లో తాను ఎన్నో తిరస్కారాలకు గురయ్యానని ఫ్యామిలీ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal thakur) అన్నారు. వాటిని ఛాలెంజ్‌గా తీసుకోవడం వల్లనే ఇప్పుడు కెరియర్లో నిలదొక్కుకోగలిగానని ఆమె చెప్పుకొచ్చారు. అలా తనను తిరస్కరించిన వారందరికీ ముందు థ్యాంక్స్ చెప్పాలని ఆమె అన్నారు. వాళ్లు అలా చేయడం వల్లనే తనలో పట్టుదల ఇంకా పెరిగిందని ఆమె చెప్పుకొచ్చారు.
ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఆమె తన మనసులోని భావాలను ఇలా వెల్లడించారు. కెరియర్ తొలి రోజుల్ని గుర్తు తెచ్చుకున్నారు. తాను ఆడిషన్స్‌కి వెళ్లినప్పుడు.. నటనకు పనికి రావని కొందరు చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. ఆ మాటలు తనలో ఎంతో పట్టుదలను పెంచాయని అన్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చానని చెప్పుకొచ్చారు.
తాను సీతారామం(Sita Ramam) సినిమాలో సీతా మహాలక్ష్మి పాత్రను ప్రాణం పెట్టి చేశానని అన్నారు. అందుకనే ఆ పాత్ర అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. తాజాగా ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన తాను నటించిన ఫ్యామిలీ స్టార్(family star) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.