»Family Star Movie Review How Is The Movie Family Star
Family Star Movie Review: ఫ్యామిలీ స్టార్ సినిమా ఎలా ఉందంటే?
పెళ్లి చూపులతో హీరోగా మారిన విజయ్ అర్జున్ రెడ్డితో స్టార్‌గా మారాడు. అయితే విజయ్ హిట్ కొట్టి చాలా రోజులు అయ్యింది. పరశురాం, విజయ్ కాంబోలో గతంలో గీత గోవిందంతో హిట్ కొట్టారు. మళ్లీ వీరిద్దరి కాంబోలో ఫ్యామిలీ స్టార్ సినిమా వచ్చింది. ఈ చిత్రంలో విజయ్ సరసన సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించింది. మరి ప్ర్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? విజయ్, పరశురాం కాంబో మళ్లీ హిట్ కొట్టారా? లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
చిత్రం: ఫ్యామిలీ స్టార్ నటీనటులు:విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, జగపతి బాబు, వెన్నెల కిషోర్, దివ్యాంశ కౌశిక్, అజయ్ ఘోష్, రోహిణి హట్టంగడి, వాసుకి, అభినయ తదితరులు సంగీతం:గోపీ సుందర్ నిర్మాత: దిల్‌రాజు, శిరీష్, శ్రీ హన్సిత రెడ్డి డైరెక్టర్:పరశురాం విడుదల:05/04/2024
కథ
గోవర్ధన్(విజయ్ దేవరకొండ) ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. గోవర్ధన్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తూ.. కుటుంబ బాధ్యతలు మోస్తుంటాడు. అయితే అతని అన్న(రవి ప్రకాష్) తాగుడికి బానిస అయి ఉంటాడు. గోవర్ధన్ తన ఇద్దరు అన్నయ్యలు, వదినల్ని, వాళ్ల పిల్లలు బాధ్యతలు తీసుకొంటాడు. కుటుంబ బాధ్యతలు అన్ని గోవర్ధన్ చూసుకుంటాడు. అలాగే కుటుంబం జోలికి ఎవరు వచ్చిన ఊరుకోడు. అలాంటి సమయంలో సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసేందుకు ఇందు(మృణాల్ ఠాకూర్) గోవర్ధన్ ఇంట్లోకి అద్దెకి వస్తుంది. అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే ఇందు గోవర్ధన్ ఇంటికి కావాలనే వచ్చిందని, దాని వెనుక ఓ మిషన్ ఉందని అతనికి అర్థం అవుతుంది. అప్పుడు గోవర్ధన్ ఏం చేశాడు? అసలు ఇందు గోవర్ధన్ ఇంటికి ఎందుకు వచ్చింది? చివరికి ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ఫ్యామిలీ కథలు అంటే ముఖ్యంగా కుటుంబ బంధాలు, బాంధవ్యాలు, ఎమోషన్స్ ఉంటాయి. కానీ సినిమాలో అంతగా ఎమోషన్స్ కనిపించవు. కుటుంబ బాధ్యతలన్నీ చిన్న కొడుకు మోస్తుంటాడు. విజయ్ కట్ బనియన్ వేసుకుని, లుంగీ కట్టుకుని, అటూ ఇటూ తిరగడం, ఆధార్ కార్డులు పట్టుకుని, ఉల్లిపాయల కోసం క్యూ లో నిలబడడం అన్నీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తాయి. అన్న అసలు తాగుడికి ఎందుకు బానిస అవుతాడో అంత లాజిక్‌గా అనిపించదు. చిన్న గొడవకే ఏళ్ల తరబడి తాగడం లాజిక్ లెస్ అనిపిస్తుంది. ఫస్టాఫ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. విజయ్, మృణాల్ జోడీ కెమిస్ట్రీ బాగుందని చెప్పవచ్చు. అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ కాస్త ఆసక్తి రేపుతుంది. ఫస్టాఫ్ అంతా ఇండియాలో జరిగితే సెకండ్ హాఫ్ అమెరికాలో ఉంటుంది. సినిమాలో డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సెకండాఫ్ అయితే ప్రేక్షకులను ఆకట్టుకోదు. చాలా బోరింగ్‌గా ఉంటుంది. హీరోయిన్ పాత్ర తక్కువగా ఉంటుంది. స్క్రీన్ ప్లే ఇంకా మంచిగా ఉంటే బాగుండేది.
ఎవరెలా చేశారంటే?
ఫ్యామిలీ స్టార్ మూవీలో విజయ్ జీవించేశాడు. తన నటన, బాడీ లాంగ్వేజ్ విషయంలో ఇంకా చెప్పక్కర్లేదు. మృణాల్ తన పాత్రకు తగ్గట్టు నటించింది. సీతారామం లాంటి డెప్త్ క్యారెక్టర్ కాదు. ఫస్టాప్‌లో స్క్రీన్‌పై ఎక్కువగా కనిపించే మృణాల్.. సెకండాఫ్‌లో కొన్ని డైలాగ్‌లకు మాత్రమే పరిమితం అవుతుంది. జగపతిబాబు పాత్ర కూడా రొటీన్ ఉంటుంది. వెన్నెల కిషోర్ కామెడీ మార్క్ కనిపించదు. మిగతా వాళ్లు పాత్రలకు తగ్గట్టు నటించారు.
సాంకేతిక అంశాలు
నిర్మాణ విలువలు బాగున్నాయి. గోపి సుందర్ మ్యూజిక్ బాగుందనే చెప్పవచ్చు. సినిమాటోగ్రఫీ ఒకే. ఎడిటింగ్ ఇంకా మంచిగా చేసి ఉంటే బాగుండేది. దర్శకుడు కథను ఇంకా బాగా రాసుకుని ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్
+ విజయ్, మృణాల్ నటన
+ఫస్టాఫ్ కామెడీ
మైనస్ పాయింట్స్
-రొటీన్ కాన్సెప్ట్
-స్క్రీన్ ప్లే
-లాజిక్స్
-ఎమోషన్స్