వేసవిలో ఉష్ణోగ్రతలు రికార్డు గరిష్ఠానికి చేరుతుంది. దీంతో చాలామంది ఎయిర్ కండిషనర్లు కొంటుంటారు. కొందరికి వీటి గురించి సరిగ్గా తెలియక కొని తర్వాత ఇబ్బంది పడుతుంటారు. మరి ఏసీ కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో తెలుసుకుందాం.
AC: ఏసీ ఎలాంటి గదిలో ఉండాలని అనుకుంటున్నారో ముందే డిసైడ్ చేసుకోవాలి. చిన్న గది లేదా పెద్ద గది అని డిసైడ్ చేసుకుంటే దాని బట్టి ఏసీ కొనుగోలు చేయాలి. చిన్న గదికి అనుకుంటే విండో ఏసీ కొనుగోలు చేయడం బెటర్. వీటిలో అన్ని పరికరాలు ఒకే బాక్స్‌లో అమర్చి ఉంటాయి. వీటిని బిగించడం కూడా ఈజీ. అలాగే వీటి ధర కూడా తక్కువ. అన్ని వాతావరణ పరిస్థితులకు సరిపోయే ఏసీ హాట్ అండ్ కోల్డ్ ఏసీ. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు ఇది గదిని చల్లబరుస్తుంది. వేసవిలో చల్లదనాన్ని, శీతాకాలంలో వెచ్చదనాన్ని అందిస్తుంది.
అవసరానికి అనుగుణంగా ఏ గదికి కావాలంటే అక్కడికి ఎలాంటి శ్రమ లేకుండా తరలించవచ్చు. అయితే వీటిని తీసుకున్నప్పుడు అందులో ఎయిర్ ఫిల్టర్లు ఉన్నవి తీసుకోవాలి. వీటివల్ల ఎలాంటి దుమ్ము చేరదు. దీంతో అలర్జీలు రావు. ఆటో క్లిన్ ఫీచర్ ఉందో లేదో తెలుసుకోవాలి. ఆటోమేటిక్‌గా దానికదే శుభ్రం చేసుకుంటుంది. గది తేమ, తడితో నిండిపోకుండా ఏసీలో డీహ్యుమిడిఫికేషన్ ఫీచర్ ఉండాలి. అలాగే స్మార్ట్ కనెక్టివిటీ, ఆప్టర్ సేల్స్ సర్వీస్, ఆటో స్టార్ట్, ఫోర్-వే స్వింగ్, టర్బో మోడ్, స్లీప్ అలార్మ్ వంటి ఫీచర్లు కూడా ఉండేలా చూసుకోవాలి. అలాగే అన్ని ఏసీల సామర్థ్యం ఒకేలా ఉండదు. కాబట్టి స్టార్ రేటింగ్ బట్టి తీసుకోవాలి.