»World Autism Awareness Day 2024 World Autism Awareness Day
World Autism Awareness Day 2024: ప్రపంచ ఆటిజం అవగాహన దినం
కొందరు పిల్లలు చురుకుగా ఉండకుండా, ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉంటుంటారు. అందరితో సరిగ్గా మాట్లాడకపోవడం, సింగిల్‌గా ఉండటానికి ఇష్టపడుతుండటం వంటి లక్షణాలు కలిగి ఉండటాన్ని ఆటిజం అంటారు. ఈ రోజు ఆటిజం అవగాహన దినం.
World Autism Awareness Day 2024: కొందరు పిల్లలు చురుకుగా ఉండకుండా, ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉంటుంటారు. అందరితో సరిగ్గా మాట్లాడకపోవడం, సింగిల్‌గా ఉండటానికి ఇష్టపడుతుండటం వంటి లక్షణాలు కలిగి ఉండటాన్ని ఆటిజం అంటారు. సాధారణంగా శిశువు మూడు నెలలు నుంచి తల్లిని గుర్తుపడతారు. కాని ఆటిజం ఉండే శిశువు తల్లిదండ్రులను గుర్తుపట్టలేదు. వినికిడి సాధారణంగానే ఉంటుంది. కానీ పేరు పెట్టి పిలిస్తే చూడలేరు.
చాలామంది పిల్లలు ఆటిజంతో బాధపడుతున్నారు. దీనితో బాధపడుతున్న వ్యక్తుల జీవన నాణ్యతను మెరుగుపరచడంతో పాటు ప్రపంచం దృష్టికి తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఏప్రిల్ 2వ తేదీని అంతర్జాతీయ ఆటిజం అవగాహన దినంగా ప్రకటించింది. పిల్లల్లో మంద బుద్ధి నివారణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ రోజు ప్రపంచ ఆటిజం అవగాహన దినం నిర్వహిస్తున్నారు.
ఆటిజం బాల్యంలోనే ప్రారంభమయ్యే జీవితకాల నాడీ సంబంధిత రుగ్మత. ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తుల నైపుణ్యాలు, అవసరాలు కాలక్రమేణా మారుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఆటిజంతో బాధపడుతున్న కొందరు వ్యక్తులు తీవ్రమైన ఇబ్బందులు కలిగి ఉంటారు. ఈ ఆటిజం తగ్గించాలంటే తల్లులు నిర్దిష్ట పోషకాలు, సప్లిమెంట్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లల్లో ఆటిజం ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అలాగే గర్భధారణ సమయంలో వాయు కాలుష్యం, భారీ లోహాలు, పర్టిక్యులేట్ పదార్థాల ప్రభావానికి గురవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.